గెజిట్ అమలును వాయిదా వేయండి: రజత్ కుమార్
Gazette notification | నదీ జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ అమలును వాయిదా వేయాలని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కోరారు.

హైదరాబాద్: నదీ జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ అమలును వాయిదా వేయాలని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కోరారు. ఈ నెల 14 నుంచి
గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రానుందని, దానిని కొద్దికాలంపాటు వాయిదా వేయాలన్నారు. గోదావరి నదిపై ఉన్న పెద్దవాగు బోర్డు పరిధిలోకి వెళ్తుందని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం జరగనున్న గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశంలో దీనిపై చర్చిస్తామన్నారు.
పెద్దవాగు పరిధిలో రెండు వేల ఎకరాల ఆయకట్టు తెలంగాణకు, 13 వేల ఎకరాల ఆయకట్టు ఆంధ్రప్రదేశ్‌కు ఉందన్నారు. ఏపీ కోరుతున్నట్లు మిగతా ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని చెప్పారు. ప్రాజెక్టులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని, గెజిట్ అమలుకు గడువు కావాలని కోరారన్నారు. ప్రస్తుతం గోదావరి బోర్డు పరిధిలోకి ఒక్క పెద్దవాగు మాత్రమే వస్తుందని చెప్పారు. సబ్‌కమిటీ నివేదికలపై చర్చిస్తామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

