వరంగల్, మార్చి 13(నమస్తేతెలంగాణ): వరంగల్ కలెక్టర్‌గా పీ ప్రావీణ్య నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడంతో సోమవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఏడాదిన్నరకుపైగా కలెక్టర్‌గా పనిచేసిన బీ గోపి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంట్లో రిపోర్టు చేయాలని ప్రభుత్వం సూచించింది.
ప్రావీణ్య 2016 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్‌గా పనిచేస్తున్న ఈమె తాజా ఉత్తర్వులతో కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.