హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే ఆధ్వర్యంలో దసరా షాపింగ్ బొనా ంజా-2023 నగారా మోగింది. బొనాంజా కార్యక్రమాన్ని హ్యుండాయ్ జోనల్ బిజినెస్ హెడ్ రామన్ భాటియా.. తెలంగాణ టుడే ఎడిటర్ జీ శ్రీనివాసరెడ్డి, నమస్తే తెలంగాణ అడ్వర్టైజ్మెంట్ జీఎం ఎస్ సురేందర్రావుతో కలిసి హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని హ్యుండాయ్ షోరూంలో సోమవారం ప్రారంభించారు. మూడేండ్లుగా షాపింగ్ బొనాంజా ఎంతో ఉత్సాహంగా కొనసాగుతున్నది. ప్రతి సంవత్సరం మరిన్ని వ్యాపార సంస్థలు భాగస్వాములుగా ఈ బొనాంజాలో చేరుతున్నాయి. నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే పత్రికల్లో ప్రతిరోజూ బొనాంజా భాగస్వాముల వివరాలు ప్రకటిస్తారు. కొనుగోలుదారులు ఆయా సంస్థల నుంచి తమకు నచ్చిన వస్తువు కొనుగోలు చేసి.. ఆ సంస్థలు అందజేసే కూపన్‌ను నింపి డ్రాప్ బాక్స్‌లో వేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు డ్రాప్బాక్స్ల్లోని కూపన్లను సేకరించి లక్కీ డ్రా ద్వారా ఐదుగురు విజేతలకు విలువైన బహుమతులను నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే అందజేయనున్నది. ఈ అవకాశం ఈ నెల 18 వరకు హైదరాబాద్‌లో ఎంపిక చేసిన అన్ని అవుట్లెట్లలో అందుబాటులో ఉంటుంది.
దసరా షాపింగ్ బొనాంజాకు టైటిల్ స్పాన్సర్స్‌గా ది చెన్నయ్ షాపింగ్ మాల్, ఫ్రీడం హెల్తీ కుకింగ్ ఆయిల్స్, ప్రధాన స్పాన్సర్స్‌గా సీఎమ్మార్ ఫ్యామిలీ మాల్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, గిఫ్ట్ స్పాన్సర్స్‌గా బిగ్ సీ, పవర్డ్ బై నీలోఫర్ కేఫ్, పార్టనర్స్‌గా బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, నిస్సాన్, మహావీర్ స్కోడా, హోప్, టీ న్యూస్, కున్ హ్యుండాయ్, సుధాకర్ పైప్స్, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్, వీఆర్ మోటర్స్, వ్యాల్యూ గోల్డ్, కలశ ఫైన్ జెవెల్స్, మారుతి సుజుకీ-వరుణ్ మోటర్స్, కిసాన్ ఫ్యాషన్ మాల్, హైబిజ్ టీవీ సంస్థలు వ్యవహరిస్తున్నాయి. కార్యక్రమంలో హ్యుండా య్ మోటర్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) జోనల్ కోఆర్డినేటర్ క్వాన్ హీ హాన్, రీజినల్ సేల్స్ హెడ్ రామ్‌కుమార్ జీ, టెరిటరీ సేల్స్ మేనేజర్ రూబెర్టాంటో, కున్ యునైటెడ్ హ్యుండాయ్ సీఈవో రాజగోపాలన్ అశోక్, నమస్తే తెలంగాణ ఏడీవీటీ ఏజీఎం రాజిరెడ్డి, డీజీఎం విజయ్ కులకర్ణి, మేనేజర్ చరణ్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది. ప్రతిఒక్కరూ ఈ దసరా షాపింగ్ బొనాంజాను సద్వినియోగం చేసుకొని బహుమతులు గెలుపొందాలి. న్యూ వెర్నా కార్ 5 స్టార్ రేటింగ్ అవార్డెడ్ను సొంతం చేసుకున్నది. ఇక్కడి రహదారులు ప్యాసింజర్ సేఫ్టీ, డ్రైవింగ్‌కు చాలా అనువుగా ఉంటాయి. నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడేతో కలిసి సాగడం గొప్పవిషయం.
పది రోజులపాటు ఎంపిక చేసిన అవుట్లెట్లలో షాపింగ్ చేస్తే ప్రతిరోజూ లక్కీడ్రా లో ఐదు విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉన్నది. ఈ నెల 18 వరకు ప్రతిరోజూ పండుగే అనేలా బహుమతులను అందజేస్తాం. బంపర్ డ్రాలో కారును కూడా గెలుచుకోవచ్చు. పండుగ ఆఫర్లతో బహుమతులు గెలుచుకొనే అద్భుత అవకాశాన్ని కొనుగోలుదారులు వినియోగించుకోవాలి.