HYDRAA | ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్నదని హైడ్రా వార్నింగ్.. కూల్చేస్తారనే భయంతో ఉరేసుకున్న మహిళ
హైదరాబాద్‌లో దూకుడుతో ఉన్న హైడ్రా ఓ మహిళ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నది. తన కూతుళ్లకు వరకట్నంగా ఇచ్చిన ఇల్లు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదన్న అధికారుల హెచ్చరికలు ఆమెను భయాందోళనకు గురిచేశాయి.
- బుల్డోజర్ హెచ్చరిక.. బుచ్చమ్మ లేదిక..
- ఆ ఇల్లు ముగ్గురు కూతుళ్లకు ఇచ్చిన కట్నం
- కూకట్పల్లి నల్ల చెరువు పరిధిలో పెను విషాదం
- రేవంత్ వల్లే మా అమ్మ ప్రాణం పోయింది: బిడ్డలు
HYDRAA | మూసాపేట, సెప్టెంబర్27: హైదరాబాద్‌లో దూకుడుతో ఉన్న హైడ్రా ఓ మహిళ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నది. తన కూతుళ్లకు వరకట్నంగా ఇచ్చిన ఇల్లు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదన్న అధికారుల హెచ్చరికలు ఆమెను భయాందోళనకు గురిచేశాయి. తమ కూతుళ్ల కుటుంబాలకు ఆధారం పోతుందన్న బెంగతో ఉరేసుకొని ప్రాణమే తీసుకున్నది. హైడ్రా చర్యలతో కట్టుబట్టలతో బజారున పడుతూ దుఃఖసాగరంలో ఎన్నో బాధిత కుటుంబాలు మునిగిపోతుండగా, ఏకంగా ఓ మహిళ ప్రాణం తీసుకోవడం సంచలనంగా మారింది. హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనతో విషాదం నిండుకున్నది. కూకట్పల్లి రామాలయానికి చెందిన గుర్రంపల్లి శివయ్య, బుచ్చమ్మ దంపతులు కూలిపనులతో జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు. ముగ్గురికీ వివాహాలు చేసి కట్నం కింద నల్ల చెరువు వద్ద ఉన్న ఇం టిని ఇచ్చారు. కూల్చివేతల్లో భాగంగా నల్ల చెరువును పరిశీలించిన హైడ్రా అధికారులు ఇండ్లు ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కూతుళ్లకు ఇచ్చిన ఇల్లు కుల్చివేస్తే బిడ్డలు రోడ్డున పడుతారనే మనస్తాపంతో శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో బుచ్చమ్మ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. కుటుంబసభ్యు లు దవాఖానకు తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇల్లు కూలుస్తరనే తట్టుకోలేకే..
‘మా అమ్మ జీవితాంతం నాన్నతో కలిసి కూలిపనులు చేసి, రూపాయి రూపాయి కూడేసి ఇల్లు కట్టించింది. ఇప్పటికీ రెక్కల కష్టంతోనే బతుకుతున్నరు. ముగ్గురు ఆడపిల్లల పెండి చేసిండ్రు. ఇల్లు ముగ్గురికీ కట్నంగా ఇచ్చిండ్రు. ఒక్కసారిగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూల్చివేస్తామని అనేసరికి పాణందీసుకున్నది’ అని బుచ్చమ్మ కూతుళ్లు, ఇతర కుటుంబ సభ్యులు రోదిస్తూ చెప్పారు. ఆమె ఆత్మహత్య చేసుకునే మనిషి కాదు. చాలా ధైర్యవంతురాలు ఆమె. ఇట్ల చేసుకుంటదని అనుకోలేదు. కొడుకులు లేకున్నా మాకున్న ఇల్లును చూసి పిల్లలు మంచిగ ఉంటారు కదా అనుకుంటూ ఉండేది. కూల్చివేస్తారన్న విషయాన్ని విని ఆమె తట్టుకోలేకపోయింది. మాకు కూడా ఆడపిల్లలే కలిగారు. వారి భవిష్యత్తు కూడా ఈ ఇంటిమీదే ఆధారపడి ఉన్నదన్న బెంగ ఉండేది. ఈ ప్రభుత్వానికి ఏది న్యాయమో అర్థం కావడంలేదు. పేద ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నదన్న సమాచారంతో బంధువులు, స్థానికుల రోదనలు మిన్నంటాయి. భర్త, కూతుళ్లను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఎన్నో ఆశలతో సొంతంగా కష్టపడి కట్టుకున్న ఇంటిని ఒక్కసారిగా ప్రభుత్వం కూల్చివేస్తుందన్న భయమే ఆమెను వెంటాడి ఈ స్థితికి చేర్చిందని స్థానికులు వాపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

