స్వల్పంగా పెరిగిన ఉష్ణోగ్రతలు
నైరుతి రుతుపవనాలు బలహీన పడి, దిగువస్థాయి నుంచి వీ స్తున్న గాలులతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. ఈ నెల 17, 18 వరకు ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుందని పేర్కొన్నది.
హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు బలహీన పడి, దిగువస్థాయి నుంచి వీ స్తున్న గాలులతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. ఈ నెల 17, 18 వరకు ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుందని పేర్కొన్నది. సాధారణంగా నైరుతి రుతుపవనాల సీజన్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని, రుతుపవనాల్లో కదలిక పెరిగి, 18 తర్వాత వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు.
నైరుతి రుతుపవనాలు ప్రారంభమైన తర్వాత గడిచిన 4 రోజులుగా ఉష్ణోగ్రతలు రాష్ట్రవ్యాప్తంగా 30 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో శుక్రవారం 32.8 డిగ్రీలు, కనిష్ఠంగా 24.9 డిగ్రీలుగా నమోదైనట్టు పేర్కొన్నారు. ఈ నెల 20 వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వెల్లడించారు. రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రంలోని పలుచోట్ల అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

