ఎకరం 60 కోట్లు

- భూముల వేలంలో కోకాపేట కేక.. హాట్ కేకుల్లా అమ్ముడైన ప్లాట్లు
- 50 ఎకరాలు.. 2000 కోట్లు
- కనిష్ఠ ధర రూ.31.2 కోట్లు
- సరాసరి రూ.40.05 కోట్లు
- హెచ్ఎండీఏకు భారీ ఆదాయం
- హైదరాబాద్‌లో రియల్ బూమ్
- నేడు ఖానామెట్ భూముల వేలం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ): రియల్ఎస్టేట్ మార్కెట్లో హైదరాబాద్ సత్తా ఏమిటో మరోసారి రుజువైంది. గురువారం ఐటీ కారిడార్‌లోని కోకాపేటలో ప్రభుత్వ భూముల అమ్మకానికి ఆన్లైన్లో నిర్వహించిన వేలం కార్యక్రమానికి రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి విపరీతమైన డిమాండ్ వచ్చింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధిచేసిన కోకాపేట నియోపోలిస్ లేఅవుట్లో ప్లాట్లు హాట్‌కేక్‌లుగా అమ్ముడుపోయాయి. ఆన్లైన్ వేలంలో మొత్తం దాదాపు 50 ఎకరాల విస్తీర్ణం కలిగిన 8 ప్లాట్లను విక్రయానికి ఉంచారు. వీటిని కొనడానికి 60 మంది బిడ్డర్లు పోటీపడ్డారు. ఎకరం కనీస ధర రూ.25 కోట్లు నిర్ణయించగా, బిడ్డర్లు పోటీ పడి మరీ స్థలాలను దక్కించుకున్నారు. ఇందులో ఎకరానికి కనిష్ఠంగా రూ.31.2 కోట్లు పలకగా, గరిష్ఠ ధర రూ.60.2 కోట్లు పలికింది. మొత్తం వేలం ప్రక్రియలో సరాసరిగా ఎకరం రూ.40.05 కోట్లు పలికింది. 2/పీ వెస్ట్ పార్ట్ గల ప్లాట్‌ను రాజపుష్ప ప్రాపర్టీస్ సంస్థ ఎకరానికి రూ.60.20 కోట్ల చొప్పున 1.65 ఎకరాలను రూ.99.33 కోట్లకు సొంతంచేసుకున్నది. మొత్తంగా కోకాపేట భూముల వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ.2000.37 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ వేలంతో హైదరాబాద్‌లో అత్యంత విలువైన భూమిగా కోకాపేటకు మరోసారి గుర్తింపు వచ్చింది. కోకాపేటలో ఇప్పటికే 58 అంతస్తుల వరకు వ్యాపార, వాణిజ్య, నివాస భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన నియోపోలిస్ లేఅవుట్‌లోనూ అదే స్థాయిలో హై రైజ్ అపార్ట్మెంట్లు నిర్మించడానికి అవకాశం ఉండటంతో బిడ్డర్లు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. ఔటర్ రింగురోడ్డును అనుకొని ఉండటంతోపాటు పక్కనే గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఉండటం వల్ల ఈ భూములకు ప్రాధాన్యం పెరిగింది. నియోపోలిస్ లే అవుట్‌లోని 8 ప్లాట్లను ఒకే రోజు ఆన్లైన్ వేలం విక్రయించారు. ఉదయం 4 ప్లాట్లను, మధ్యాహ్నం మరో 4 ప్లాట్లను వేలం వేశారు. ఈ ప్రక్రియను కేంద్ర రంగ సంస్థ ఎంఎస్టీసీ నిర్వహించింది.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

