మురుగునీటి శుద్ధిలో హైదరాబాద్ ఆదర్శం
హైదరాబాద్లో నూటికి నూరు శాతం మురుగునీటిని శుద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి జలమండలి చేరువైంది. దేశంలోని ఏ మెట్రో నగరాల్లో లేని విధంగా రూ.3,866.41 కోట్ల వ్యయంతో 31 ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
- రేపు 5 ప్రాంతాల్లో ఎస్టీపీలు ప్రారంభం
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో నూటికి నూరు శాతం మురుగునీటిని శుద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి జలమండలి చేరువైంది. దేశంలోని ఏ మెట్రో నగరాల్లో లేని విధంగా రూ.3,866.41 కోట్ల వ్యయంతో 31 ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వీటిలో ఇప్పటికే కోకాపేట, దుర్గంచెరువు వద్ద ఎస్టీపీలను ప్రారంభించింది. ఈ నెల 8న మరో ఐదు చోట్ల ఎస్టీపీలను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. మీర్ఆలం (41.5 ఎంఎల్డీ), నల్లచెరువు (86.5), పెద్దచెరువు (17.5 ఎంఎల్డీ), ఫతేనగర్ (133 ఎంఎల్డీ), ఖాజాకుంట (20 ఎంఎల్డీ), మియాపూర్ పటేల్చెరువు (7 ఎంఎల్డీ) ఎస్టీపీల ప్రారంభానికి జలమండలి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. 878 ఎంఎల్డీల మురుగునీటి శుద్ధి ప్రక్రియను త్వరలో చేపట్టాలని భావిస్తున్న జలమండలి.. 31 చోట్ల ఎస్టీపీల నిర్మాణం చేపట్టింది. వీటిలో 24 చోట్ల ఎస్టీపీల పనులు తుది దశలో ఉన్నాయి. ఈ నెలాఖరు నాటికి మొత్తం అన్ని ఎస్టీపీలను అందుబాటులోకి తేవడం ద్వారా మురుగునీటి శుద్ధిలో హైదరాబాద్ను దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు జలమండలి కసరత్తు చేస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Hyderabad
- STP
- Wastewater
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

