మీర్‌చౌక్ సీఐ రిమాండ్
మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్స్పెక్టర్ కొండల్రావు, హోమ్‌గార్డు ఆబీద్అలీను 14 రోజులపాటు రిమాండ్‌కు తరలిస్తూ ఏసీబీ కోర్టు జడ్జి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరినీ సాయంత్రం ఏసీబీ కోర్టు ఎదుట అధికారులు హాజరుపర్చగా రిమాండ్‌కు తరలిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
- కేసును తొలగించేందుకు రూ.3లక్షల లంచం
నాంపల్లి క్రిమినల్ కోర్టులు, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్స్పెక్టర్ కొండల్రావు, హోమ్‌గార్డు ఆబీద్అలీను 14 రోజులపాటు రిమాండ్‌కు తరలిస్తూ ఏసీబీ కోర్టు జడ్జి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరినీ సాయంత్రం ఏసీబీ కోర్టు ఎదుట అధికారులు హాజరుపర్చగా రిమాండ్‌కు తరలిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓ వ్యక్తిపై మీర్‌చౌక్ పోలీసు స్టేషన్లో నమోదైన కేసును మూసివేయడంతోపాటు బలవంతపు చర్యలు తీసుకోకుండా సహకరించేందుకు రూ. 6 లక్షలు ఇన్స్పెక్టర్ డిమాండ్ చేశాడు. ఓ కిరాణాషాపు యజమాని ద్వారా హోమ్‌గార్డు ఆబీద్ అలీ రూ. 3 లక్షలు తీసుకుంటుండగాఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్కు చెందిన మొబైల్ఫోన్లు, ఫిర్యాదుదారుడితో నిందితులకు జరిగిన సంభాషణలను అధికారులు సీడీలో నిక్షిప్తం చేసి కోర్టుకు సమర్పించారు. వీరిద్దరినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

