Rain Update | మరో మూడు రోజుల పాటు వర్షాలు.. జిల్లాల్లో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండండి: సీఎస్
మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.
Rain Update | హైదరాబాద్, జూలై 22(నమస్తే తెలంగాణ): మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. వరదలు, వర్షాల ప్రభావంపై సోమవారం డీజీపీ జితేందర్, ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్సుల్తానియాతో కలిసి ఆమె కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో వారం రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలపై సీఎం నిరంతరం సమీక్షిస్తున్నారని, జిల్లాల్లో ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. పునరావాస కేంద్రాల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలని, పోలీస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తదితర శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
అన్ని జిల్లాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ, వర్షాల నేపథ్యంలో పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాల్లో వర్ష, వరదల తీవ్రత దృష్ట్యా పూర్తి అప్రమత్తంగా ఉన్నామని, తగు చర్యలు తీసుకుంటున్నామని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల కలెక్టర్లు తెలిపారు.
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. సోమవారం భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్ఛరికను జారీచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

