హైదరాబాద్ అభివృద్ధికి 10 వేల కోట్లు
హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లు, ఆర్వోబీల వంటి రవాణా వ్యవస్థల ఏర్పాటుతో పాటు నాలాల పూడికతీత, వరద మళ్లింపు నిర్మాణ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెచ్-సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)కి రూ.2,675.35 కోట్లు సహా జీహెచ్ఎంసీకి రూ.3,075.7 కోట్లు కేటాయించింది.
హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లు, ఆర్వోబీల వంటి రవాణా వ్యవస్థల ఏర్పాటుతో పాటు నాలాల పూడికతీత, వరద మళ్లింపు నిర్మాణ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెచ్-సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)కి రూ.2,675.35 కోట్లు సహా జీహెచ్ఎంసీకి రూ.3,075.7 కోట్లు కేటాయించింది. హెచ్ఎండీఏకు రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ ఏ ప్రాజెక్టుకు దీనిని ఖర్చు పెట్టాలనేదానిపై అధికారుల్లోనూ స్పష్టత లేదు. హెచ్ఎండీఏ తలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రూ.3,800 కోట్లు కావాల్సి ఉన్నందున ఈ కేటాయింపు దేనికి సరిపోతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జలమండలికి ఈ బడ్జెట్లో రూ.3,385 కోట్లు కేటాయించగా, ఇందులో అభివృద్ధి పనులకు రూ.1,450 కోట్లు, సుంకిశాల ప్రాజెక్టుకు రూ.1,000 కోట్లు, ఉచిత మంచినీటి పథకానికి రూ.300 కోట్లు వెచ్చించనున్నారు. పేద ప్రజల వైద్య సేవల కోసం కేసీఆర్ ప్రభుత్వం మొదలుపెట్టిన సూపర్‌స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి అరకొర కేటాయింపులే జరిపారు. మూడు దవాఖానలతో వరంగల్‌లోని దవాఖానల నిర్మాణానికి కలిపి రూ.260 కోట్లు మాత్రమే కేటాయించారు. మొత్తంగా హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లు కేటాయించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

