Hyderabad | అనుమానంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు.. కత్తితో తల, మొండెం వేరు
Hyderabad | అనుమానంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. కత్తితో తల, మొండెం వేరు చేసి అతి దారుణంగా చంపేశాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జి ల్లా అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణా పరిధిలోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో మంగళవారం చోటుచేసుకున్నది. పురాణాపూల్‌కు చెందిన పుష్పలత అలియాస్ సువర్ణ (42)తో సికింద్రాబాద్‌కు చెందిన విజయ్‌కుమార్‌కు 2009 లో పెండ్లి జరిగింది.
- అనుమానంతో ఘాతుకం
- జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో దారుణం
- అనాథలుగా మారిన ఇద్దరు పిల్లలు
పెద్దఅంబర్‌పేట, జనవరి 16: అనుమానంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. కత్తితో తల, మొండెం వేరు చేసి అతి దారుణంగా చంపేశాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణా పరిధిలోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో మంగళవారం చోటుచేసుకున్నది. పురాణాపూల్‌కు చెందిన పుష్పలత అలియాస్ సువర్ణ (42)తో సికింద్రాబాద్‌కు చెందిన విజయ్‌కుమార్‌కు 2009 లో పెండ్లి జరిగింది. పుష్పలత కంటే విజయ్ వయసులో ఆరేండ్లు చిన్న. పుష్పలతకు ఇది మూడోది, విజయ్‌కి తొలి వివాహం.
విజయ్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. సరూర్‌నగర్‌తోపాటు పలు ప్రాంతాల్లో వీరు నివసించారు. 2 నెలల కిందటే జేఎన్‌ఎన్‌యూఆర్‌ం కాలనీలోకి మారారు. చాలాకాలంగా పుష్పలత ప్రవర్తనపై తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవి. విజయ్‌పై పుష్పలత మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో గృహ హింస కేసు పెట్టింది. పుష్పలతపై విజయ్ అనుమానం పెంచుకున్నాడు. చెప్పినా ఆమె తీరు మార్చుకోకపోవడంతో ఆమెను చంపాలని విజయ్ నిర్ణయించుకున్నాడు. మంగళవారం అదే కాలనీలోని డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలోని తన సోదరి ఫ్లాట్‌ను శుభ్రం చేసేందుకు పుష్పలతను తీసుకెళ్లాడు. అప్పటికే సిద్ధం చేసుకున్న కత్తితో ఆమెను చంపేశాడు. కత్తితో తల, మొండెంను వేరుచేసి అతి దారుణంగా హత్య చేశాడు. తల్లి మరణం, తండ్రి జైలు పాలవ్వడంతో 13 ఏండ్ల కొడుకు, తొమ్మిదేండ్ల కుమార్తె ఇద్దరు అనాథలయ్యారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

