Medaram | మేడారంలో భారీగా ట్రాఫిక్‌జామ్.. 12 గంటలుగా నిలిచిపోయిన వాహనాలు
Medaram | మేడారంలో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. రద్దీ కారణంగా 12 గంటలుగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Medaram | మేడారంలో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. రద్దీ కారణంగా 12 గంటలుగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పసరా నుంచి తాడ్వాయి మీదుగా మేడారం చేరుకునే ఆర్టీసీ బస్సులతో పాటు, వీఐపీ వాహనాలు శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ జామ్ కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పసరా నుంచి నార్లాపూర్ రూట్లో వెళ్లే ప్రైవేటు వాహనాలు కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. మేడారం నుంచి తిరుగు ప్రయాణమయ్యే భక్తులకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేక వేలాది మంది భక్తులు మేడారం బస్టాండ్‌లో బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు
కోట్లు ఖర్చుచేసినా భక్తులకు పాట్లు!
మహాజాతరకు శుక్రవారం లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో మేడారం జనసంద్రమైంది. అయితే ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా రద్దీకనుగుణంగా సౌకర్యాల్లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గద్దెలకు రెండు వైపులా ఉన్న క్యూలైన్లలో కనీస వసతులు లేని కారణంగా క్యూలైన్లలోనే కుప్పకూలిపోయారు. దూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలకోర్చి తల్లుల దర్శనానికి వచ్చిన వారికి తీవ్ర నిరాశ ఎదురైంది. వృద్ధులు, చిన్న పిల్లలు, అనారోగ్యంతో బాధపడే వారు అవస్థలు పడ్డారు. తల్లుల దర్శనం కోసం కలెక్టర్ మంజూరు చేసిన వీఐపీ, వీవీఐపీ పాస్‌లు పొందిన భక్తులకు క్యూలైన్లను ఎత్తేయడంతో శుక్రవారం జాతరకు వచ్చిన భక్తులు పాస్‌లు చేత పట్టుకొని క్యూలైన్లు, దర్శనాల కౌంటర్ల కోసం మేడారం వీధుల్లో వెతుకుతూ కనిపించారు. మరికొందరు దర్శనాలు చేసుకోకుండానే మెయిన్ గేటు బయట నుంచే మొక్కులు చెల్లించుకొని తిరుగు పయనమయ్యారు. గురువారం రాత్రి సమ్మక్క తల్లి గద్దెకు చేరిన తర్వాత భక్తుల రాక ఒక్కసారిగా పెరగడంతో పోలీసులు కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు.
అదుపు తప్పిన పరిస్థితులు
భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో పార్కింగ్ స్థలాలు వాహనాలతో నిండిపోయాయి. ఎటు చూసినా దారులన్నీ కిక్కిరిసి కనిపించాయి. మంగళవారం రాత్రి వరకు నామమాత్రంగా ఉన్న భక్తుల సంఖ్య.. బుధవారం నుంచి అనూహ్యంగా పెరిగింది. 2020 మహాజాతరలో 6 వేల మరుగుదొడ్లను నిర్మించగా, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రస్తుతం 5,600 నిర్మించారు. బ్యాటరీ ఆఫ్ ట్యాప్‌లను గత జాతరల కంటే తక్కువ సంఖ్యలో ఏర్పాటు చేశారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. శనివారం తల్లుల వన ప్రదేశంతో జాతర పరిసమాప్తం కానున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
Vice President | ఏపీలో 26,27వ తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన
RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

