Praja Darbar | ప్రజాదర్బార్‌కు భారీగా దరఖాస్తుదారులు.. అరకిలోమీటర్ మేర నిలబడిన ప్రజలు
ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్ (Praja Darbar) కొనసాగుతున్నది. సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో ప్రజాభవన్ (Praja Bhavan) వద్ద తమ వంతుకోసం అరకిలోమీటర్ మేర దరఖాస్తుదారులు లైన్లలో నిలబడ్డారు.
హైదరాబాద్: ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్ (Praja Darbar) కొనసాగుతున్నది. సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో ప్రజాభవన్ (Praja Bhavan) వద్ద తమ వంతుకోసం అరకిలోమీటర్ మేర దరఖాస్తుదారులు లైన్లలో నిలబడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరిస్తున్నారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని యువత, తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ లారీల యజమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పింఛన్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం అనేక మంది వికలాంగులు, వృద్ధులు, చంటిపిల్లల తల్లులు వచ్చారు. దరఖాస్తుదారులకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదట్లో ప్రతి రోజూ నిర్వహించిన ప్రభుత్వం.. తర్వాత దానిని మంగళ, శుక్రవారాలకు పరిమితం చేసింది. రెండు రోజుల్లో ఉదయం 10 గంటల వరకు ప్రజాభవన్‌కు వచ్చినవారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. వారిని అర్జీలను స్వీకరించి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

