Gutka packets seized | ఆదిలాబాద్ జిల్లాలో భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
Gutka packets seized | ఆదిలాబాద్ జిల్లాలో(Adilabad) భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్లు(Gutka packets) స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. గుట్కా ప్యాకెట్లు నిల్వ చేశారనే సమాచారం మేరకు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని ఐదు గోడౌన్స్‌లో తనిఖీలు చేపట్టారు.
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో(Adilabad) భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్లు(Gutka packets) స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. గుట్కా ప్యాకెట్లు నిల్వ చేశారనే సమాచారం మేరకు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని ఐదు గోడౌన్స్‌లో తనిఖీలు చేపట్టారు. రూ.77,60,586 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లు లభించాయని ఎస్పీ తెలిపారు. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని, పరారీలో ఉన్నర మరో ముగ్గురు నిందితులను త్వరలో పట్టుకుంటామని ఆయన తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా నిషేధిత గుట్కాను అమ్మినా, రవాణా చేసినా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుట్కాను సమూలంగా జిల్లా వ్యాప్తంగా రూపుమాపాలనే ఉద్దేశంతో ప్రత్యేక సిబ్బందిని నియమిస్తూ నిఘా వ్యవస్థను పటిష్టం చేశామన్నారు. గుట్కా విక్రయదారులు నిషేధిత గుట్కాను విక్రయించడం మానుకోవాలని సూచించారు. ఈ దాడుల్లో జిల్లా ఎస్పీతో సహా ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, సీఐలు కె. సత్యనారాయణ, ఎ. అశోక్, ఎ. రమాకాంత్, సీసీఎస్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి : హాలియా ఏడీఏ సరిత
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్మానం
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

