Huge Flood | శ్రీరాంసాగర్, జూరాల ప్రాజెక్టులకు భారీగా వరద
Huge Flood | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంటున్నాయి. తాజాగా శ్రీరాంసాగర్(Sriram sagar) ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద(Huge Flood) కొనసాగుతున్నది. ప్రాజెక్ట్‌లోకి 17 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది.
హైదరాబాద్ : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంటున్నాయి. తాజాగా శ్రీరాంసాగర్(Sriram sagar) ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద(Huge Flood) కొనసాగుతున్నది. ప్రాజెక్ట్‌లోకి 17 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం1065.7 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సమార్థ్యం 80.5 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 16.405 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
జూరాలకు కొనసాగుతున్న వరద..
ఎగువన సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) భారీగా వరద వస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 20 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నుంచి దిగువకు 27,877 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 318.516 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 315.850 అడుగులు ఉంది. జలాశయం నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.951 టీఎంసీలుగా ఉందని అధికారులు తెలిపారు.
ఇక అల్మట్టి ప్రాజెక్టుకు 43,478 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 65,480 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 97.416 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, నీటిమట్టం 517.98 మీటర్ల వద్ద ఉన్నది. అల్మట్టి పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 123.081 టీఎంసీలు కాగా, నీటిమట్టం 519.60 మీటర్లు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

