నానమ్మకు హిమాన్షు పుట్టినరోజు శుభాకాంక్షలు
హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ పుట్టినరోజు సందర్భంగా మనవడు కల్వకుంట్ల హిమాన్షు శనివారం నానమ్మకు శుభాకాంక్షలు తెలిపారు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు నాని! మీ త్యాగాలు వెలకట్టలేనివి. నేను చూసిన అత్యంత శక్తిమంతమైన మహిళల్లో మీరు ఒకరు. మన కుటుంబానికి వెన్నెముకగా నిలిచినందుకు ధన్యవాదాలు. మీరు లేని కుటుంబం రంగులేని కాన్వాస్ లాంటిది. నన్ను తీర్చిదిద్దినందుకు ధన్యవాదాలు. లవ్ యు నాని’ అని ట్వీట్ చేశారు.