పెద్దపల్లి, మే 2: భానుడు భగభగమండుతూ నిప్పులు కురిపిస్తుండటంతో పెద్దపల్లి జిల్లాలో రెండు రోజులుగా 45డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదుకాగా రెడ్అలర్ట్ ప్రకటించారు. శనివారం జిల్లాలోని కమాన్‌పూర్‌లో 45.8, అంతర్గాం మండలం అకెనపల్లిలో 45.7, పెద్దపల్లి మండలం భోజన్నపేటలో 45.7, రామగుండంలో 45.3, పాలకుర్తి మండలం ఈసాల తక్కళ్లపల్లి, మంథని మండలం ఎక్లాస్పూర్, పెద్దపల్లి మండలం పాలితం, ఎలిగేడులో 45.2, రామగిరి మండలం కల్వచర్లలో 45.1డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.