బోనాల నిర్వహణపై 25న అత్యున్నతస్థాయి సమావేశం : మంత్రి తలసాని
25న అత్యున్నతస్థాయి సమావేశం | రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆషాడమాసం బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షించేందుకు ఈ నెల 25న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(MCHRD)లో అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆషాఢ మాస బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షించేందుకు ఈ నెల 25న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(MCHRD)లో అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గతేడాది కరోనా మహమ్మారి కారణంగా బోనాలను నిర్వాహించుకోలేక పోయామని ఆయన గుర్తుచేశారు.‘‘ఈ ఏడాది ఘనంగా ఆషాఢ బోనాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రూ.15 కోట్లు మంజూరు చేశారు. జూలై 11న గోల్కొండ బోనాలు, 25న సికింద్రాబాద్ బోనాలు, ఆగస్టు 1న హైదరాబాదు బోనాల ఉత్సవాలు ఉంటాయి. 25న జరిగే అత్యున్నతస్థాయి సమావేశానికి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, హోంమంత్రి మహమూద్ అలీ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్లు అంజనీ కుమార్, మహేష్ భగవత్, సజ్జనార్, వివిధ శాఖల అధికారులు పాల్గొంటారు’’ అని మంత్రి తలసాని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

