కేకే పిల్లల స్థలాల క్రమబద్ధీకరణకు రూల్స్ ఎలా ఉల్లంఘిస్తారు?
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ కే కేశవరావు కుటుంబసభ్యులకు చెందిన స్థలాల క్రమబద్ధీకరణలో నిబంధనల ఉల్లంఘన ఎలా జరిగిందని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. దీనికి సంబంధించి ప్ర భుత్వ విధానం ఏమిటని ప్రశ్నించింది.
- ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
- కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ కే కేశవరావు కుటుంబసభ్యులకు చెందిన స్థలాల క్రమబద్ధీకరణలో నిబంధనల ఉల్లంఘన ఎలా జరిగిందని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. దీనికి సంబంధించి ప్ర భుత్వ విధానం ఏమిటని ప్రశ్నించింది. బంజారాహిల్స్ స్లమ్ ఏరియాల్లో కేశవరావు కొడుకు కే వెంకటేశ్వరావుకు 1161 గజాల స్థలాన్ని, కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి 425 గజాల స్థలాన్ని క్రమబద్ధీకరణ చేయడాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రతివాదులైన రెవెన్యూ, మున్సిపల్ శాఖల ముఖ్యకార్యదర్శులు, సీసీఎల్ఏ, హైదరాబాద్ కలెక్టర్, షేక్‌పేట్ తహసిల్దార్తోపాటు కే వెంకటేశ్వరరావు, గద్వాల్ విజయలక్ష్మి, కవితారావుకు నోటీసులు జారీ చేసింది. కవితారావుకు చెందిన 425 గజాల స్థలానికి గద్వాల్ విజయలక్ష్మి జీపీఏ హోల్డర్ గా ఉన్నారు. నామమాత్రపు ధరతో స్థలాల ను క్రమబద్ధీకరించడంపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
కేకే కుటుంబసభ్యులకు చెందిన స్థలాలను క్రమబద్ధీకరిస్తూ వెలువడిన జీవో 56ను సవాలు చేస్తూ సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన జీ రఘువీర్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. వెంకటేశ్వరరావుకు 1998 నాటి మా రెట్ విలువ ప్రకారం చదరపు గజం రూ. 2500గా నిర్ణయించి ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేయడం చెల్లదని పిటిషనర్ తరఫు న్యా యవాది వాదించారు. కవితారావు తరఫున విజయలక్ష్మికి చెందిన 425 చదరపు గజాల స్థలాన్ని గజం రూ.350 చొప్పున క్రమబద్ధీకరణకు వెలువడిన జీవోను కూడా రద్దు చేయాలని కోరారు. కేకే పిల్లలు 1998లో దరఖాస్తు చేసుకుంటే అప్పటి ధర ప్రకారం క్రమబద్ధీకరణ చేయడం చెల్లదని, క్రమబద్ధీకరణ చేసిన 2023లో గజం స్థలం రూ.50 వేలు ఉన్నదని, ఈ ధర ప్రకారం చేయాలని చెప్పారు. నామమాత్రపు ధరకు క్రమబద్ధీకరణ చేయడం వల్ల ప్రభుత్వానికి రూ.9.25 కోట్లకుపైగా నష్టం వచ్చిందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

