కడియం, తెల్లంకు హైకోర్టు నోటీసులు
స్టేషన్‌ఘన్‌పూర్, భద్రాచలం అసెంబ్లీ స్థానాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలుపొంది కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
- కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు
- పార్టీ ఫిరాయింపుల కేసులో హైకోర్టు చర్యలు
హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): స్టేషన్‌ఘన్‌పూర్, భద్రాచలం అసెంబ్లీ స్థానాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలుపొంది కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా పార్టీ ఫిరాయించిన వారు ఎమ్మెల్యేలుగా అనర్హులని, వారిపై వేటు వేయాలని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది.
కడియం, తెల్లంతోపాటు ఇతర ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ, శాసనసభ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘాలకు కూడా నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు కోసం అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే లోనికి అనుమతించలేదని పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.
గత విచారణ సమయంలో హైకోర్టు, ప్రభుత్వ న్యాయవాది ద్వారా పిటిషన్ల ప్రతులను అసెంబ్లీ కార్యదర్శికి అందజేయాలని ఆదేశించింది. ఈ మేరకు పిటిషన్ల ప్రతులను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశామని, నిర్ధారణ చేస్తూ పిటిషనర్‌కు కూడా తెలియజేశామని అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి చెప్పారు. ఈ మేరకు హైకోర్టు, ప్రతివాదులు తమ వాదనలు తెలియజేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. విచారణను జూన్ 5కి వాయిదా వేసింది. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని సవాల్ చేసిన మరో కేసులో గతంలోనే హెకోర్టు నోటీసులు జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

