ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దుల్లో హైఅలర్ట్
Telangana | ఛత్తీస్‌గఢ్ - తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు అగ్రనేత హిద్మా కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ

హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు అగ్రనేత హిద్మా కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో రాకపోకలను కొనసాగిస్తున్న వాహనాలను భద్రతా బలగాలు తనిఖీ చేస్తున్నాయి. ఆ ఏరియాల్లోని నివాసాలను కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు.
ములుగు జిల్లా వాజేడు మండలానికి 20 కిలోమీటర్ల దూరంలోని తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో పెనుగోలు, లంకపల్లి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. కూంబింగ్ నిర్వహిస్తున్న తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టు వెంకటాపురం సీఐ కాగితోజు శివప్రసాద్ తెలిపారు.
వారి వద్ద ఏకే 47, ఎస్ఎల్ఆర్ రైఫిల్స్‌ను పోలీసులు గుర్తించారు. మృతుల్లో నరోటి దామాల్ (పీపీసీఎం) మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా గట్ట ఏరియా వాసి, పునెం బద్రుది బీజాపూర్ జిల్లా పెద్దకోర్మ గ్రా మం, బీజాపూర్ జిల్లాకు చెందిన సోడి రామాల్ (సంతోష్ )గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం బీజాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్టు సీఐ తెలిపారు. దీనికి సంబంధించి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఎలిగేడ్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. మరణించిన మావోయిస్టులకు జోహార్లు అర్పించినట్టు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

