ఎస్సారెస్పీకి పోటెత్తిన వరద

- 32 గేట్ల ద్వారా నీటి విడుదల
నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 23: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తుతున్నది. దీంతో గురువారం 32 వరద గేట్లు ఎత్తి దిగువ గోదావరిలోకి మిగులు జలాలను వదులుతున్నారు. ఎగువ నుంచి 1,68,000 క్యూసెక్కుల వరద వస్తుండగా 1,67,956 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా సాయంత్రానికి 1,090.90 అడుగుల (89.763 టీఎంసీలు) నీటినిల్వ ఉన్నది. ప్రాజెక్ట్‌లోకి ఈ సీజన్లో ఇప్పటివరకు 318.503 టీఎంసీల వరద వచ్చినట్టు ఈఈ తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి 24,114 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి 34,673 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
జూరాలకు 44 వేల క్యూసెక్కుల వరద..
ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాలకు వరద వచ్చి చేరుతున్నది. జూరాలకు 44 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 40,388 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. 37,100 క్యూసెక్కులు విద్యుదుత్పత్తికి వినియోగిస్తుండగా.. ఎగువ, దిగువ విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా 8.969 టీఎంసీలు నిల్వ ఉన్నది.
సాగర్‌లో నాలుగు గేట్ల ద్వారా..
నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో పెరగడంతో అధికారులు ప్రాజెక్టు 4క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ రిజర్వాయర్‌లో పూర్తి సామర్థ్యం 590 అడుగుల (312.045 టీఎంసీలు) మేరకు నిల్వ ఉంచి అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌కు 79,796 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

