25 వరకు తేలికపాటి వానలు
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొన్నది. ఈ నెల 25 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని తెలిపింది.