ఆరోగ్య తెలంగాణకు హెల్త్ ప్రొఫైల్
- ప్రజారోగ్య పరిరక్షణే పరమావధి
- వైద్యరంగానికి బడ్జెట్లో భారీ నిధులు
- ఆరోగ్య సేవలు ఐదంచెలకు విస్తరణ
- వైద్య పరీక్షలకు డయాగ్నస్టిక్ సెంటర్లు..
- రాష్ట్ర ప్రభుత్వ అప్రమత్తతకు నిదర్శనం
- కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మితో గుణాత్మక మార్పు
- ఉక్రెయిన్ విద్యార్థుల మేలుకు చర్యలు
- ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడి
- ప్రజలకు ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు
హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య తెలంగాణ కోసం హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. గురువారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు చక్కటి ఆరోగ్యంతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తున్నదని వెల్లడించారు. ప్రజా వైద్యం, ఆరోగ్య రంగాల్లో రాష్ట్రం రోజురోజుకు గుణాత్మక పురోగతి సాధిస్తున్నదని వివరించారు. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రజారోగ్య పరిరక్షణే పరమావధిగా పనిచేస్తున్నదని స్పష్టం చేశారు. వైద్యరంగానికి బడ్జెట్లో భారీగా నిధులు పెంచామని, వైద్య శాఖలో కొత్తగా 21,073 పోస్టులు మంజూరు చేశామని తెలిపారు.
బస్తీ దవాఖానలకు ప్రజాదరణ
‘ప్రజల వద్దకే వైద్యం’ లక్ష్యంతో బస్తీ దవాఖానలు విజయవంతంగా ప్రజాదరణ పొందుతున్నాయని, దాని స్ఫూర్తితో ఏర్పాటైన పల్లె దవాఖానలు సేవలు అందిస్తున్నాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 350 బస్తీ దవాఖానల ద్వారా 81 లక్షల మందికి, 2,250 పల్లె దవాఖానల ద్వారా 19.61 లక్షల మందికి వైద్యం అందించామని వివరించారు. సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణం, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, అనుబంధంగా నర్సింగ్ కాలేజీల ఏర్పాటు, నిర్మాణం, మాతాశిశు సంరక్షణ కేంద్రాలు, యూజీ, పీజీ, సూపర్ స్పెషలిటీ వైద్య సీట్ల పెంపు, నర్సింగ్ కాలేజీ సీట్ల పెంపుతో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలను విసృ్తతపరుస్తున్నామని పేర్కొన్నారు. అటు.. కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాలు ప్రజారోగ్య రంగంలో గుణాత్మక మార్పునకు దోహదం చేస్తున్నాయని తెలిపారు. తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటుతో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇది ప్రభుత్వ అప్రమత్తతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
వైద్య సిబ్బందికి వేతనాలు పెంచాం
ఉద్యోగుల వయోపరిమితి పెంపుతో పాటు, వైద్య సిబ్బందికి వేతనాలు పెంచామని, ప్రోత్సాహకాలు అందించామని సీఎం కేసీఆర్ తెలిపారు. అటు.. కరోనా కట్టడిలో భాగంగా ఫీవర్ సర్వే నిర్వహించి దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని సీఎం స్పష్టం చేశారు. అటు.. ప్రసూతి కేంద్రాల ఆధునీకరణ, అవయవ మార్పిడి కేంద్రాలు, నిమ్స్, గాంధీ, ఉస్మానియాలో కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులు, లివర్ మార్పిడి కేంద్రాలను ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. బోన్‌మారో, స్టెమ్ సెల్ చికిత్స కేంద్రాలు తీసుకొచ్చామని అన్నారు.
మూడంచెల నుంచి ఐదంచెల వ్యవస్థకు ఆరోగ్య సేవలు
రాష్ట్రంలో ఆరోగ్య సేవలను మూడంచెల వ్యవస్థ నుండి ఐదంచెల వ్యవస్థకు విస్తరించామని కేసీఆర్ వెల్లడించారు. ప్రాథమిక (పీహెచ్సీ, సీహెచ్‌సీ), ద్వితీయ (ఏహెచ్, డీహెచ్), తృతీయ – బోధనా దవాఖాన, కొత్తగా ప్రివెంటివ్, సూపర్ స్పెషలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చామని వివరించారు. పాలియేటివ్ కేర్ ప్రోగ్రాం, ఎన్సీడీ స్రీనింగ్ ప్రోగ్రాం, మిడ్ వైఫరీ ప్రోగ్రాం, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ పాలసీ, పారిశుద్ధ్య నిర్వహణ పాలసీ, దవాఖానల్లో రోగులకు డైట్ చార్జీల పెంపు, సహాయకులకు సబ్సిడీ భోజనం వంటివి అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. కాగా, ఉక్రెయిన్ వైద్య విద్యార్థులకు మేలు చేకూర్చేలా చర్యలు చేపట్టామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

