హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు ఒక డీ-అడిక్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మొత్తం 34 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ పరిధిలో రెండు (ఎర్రగడ్డలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, గాంధీ దవాఖాన), మిగతా జిల్లాల్లో జిల్లా దవాఖానలు లేదా ఏరియా హాస్పిటళ్లలో ఏర్పాటు చేస్తారు.