రాజ్యాధికారమే లక్ష్యంగా సాగుదాం
సమాజంలో మెజారిటీ వర్గాలుగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఐక్యతతో రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పలువురు వక్తలు సూచించారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సాయంత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మొదటి వార్షికోత్సవ సభ నిర్వహించారు.
- బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ వార్షికోత్సవ సభలో వక్తలు
చిక్కడపల్లి, జూన్ 28: సమాజంలో మెజారిటీ వర్గాలుగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఐక్యతతో రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పలువురు వక్తలు సూచించారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సాయంత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మొదటి వార్షికోత్సవ సభ నిర్వహించారు. బీసీ జాతీయ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వర్యయ్య గౌడ్ మాట్లాడుతూ కొన్నికులాల పాలన పోవాలని, అన్నికులాల పాలన రావాలని అన్నారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ దేశంలో దాదాపు 130 కోట్ల జనాభా ఉన్నదని, ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎంతమందో లెక్కలేదని విమర్శించారు. ఈ వర్గాల జనాభా తెలిస్తే వీరు చైతన్యం అవుతారని, అందుకే జనాభా లెక్కలు తేల్చడం లేదని మండిపడ్డారు. పాలకులు ఈ వర్గాలపట్ల వివక్ష చూపుతున్నారని విమర్శించారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ కూడా లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అనేక హామీలు ఇచ్చి అమలు చేయలేదని ధ్వజమెత్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

