సాగర్‌పై సర్కారు మొద్దునిద్ర
నాగార్జునసాగర్ డ్యామ్పైనే కాదు మొత్తం కృష్ణా జలాలపైనే కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసిందా? అనే అనుమానం కలుగుతున్నది జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే! ఏపీ రాత్రికి రాత్రి కృష్ణా జలాలను ఎలాంటి అనుమతుల్లేకుండా తరలించుకుపోయినా మొద్దునిద్ర పోతున్నది. విషయం బయటకు పొక్కడంతో బోర్డుకు లేఖ రాసి చేతులు దులుపుకొన్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ డ్యామ్పైనే కాదు మొత్తం కృష్ణా జలాలపైనే కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసిందా? అనే అనుమానం కలుగుతున్నది జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే! ఏపీ రాత్రికి రాత్రి కృష్ణా జలాలను ఎలాంటి అనుమతుల్లేకుండా తరలించుకుపోయినా మొద్దునిద్ర పోతున్నది. విషయం బయటకు పొక్కడంతో బోర్డుకు లేఖ రాసి చేతులు దులుపుకొన్నది. నాగార్జునసాగర్‌లో విద్యుత్తు ఉత్పత్తి కోసం వాడిన నీరు దిగువకు పోకుండా నిల్వ చేసేందుకు వీలుగా, డ్యామ్ నుంచి 21 కిలోమీటర్ల వద్ద నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం చిట్యాల గ్రామం వద్ద కృష్ణానదిపై ఏడు టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో టెయిల్‌పాండ్ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఆ నీటిని రివర్స్ టర్బయిన్ల ద్వారా తిరిగి నాగార్జునసాగర్ జలాశయంలోకి పంపిస్తారు. గతంలో ఎన్న డూ నిల్వ చేసిన నీటిని దిగువకు విడుదల చేయలేదు. కానీ, తాజాగా ఏపీ మాత్రం ప్రాజెక్టులో నిల్వ ఉన్న 6.73 టీఎంసీల జలాల్లో నాలుగు టీఎంసీలను రాత్రికి రాత్రి తరలించుకుపోయింది. అది కూడా కేఆర్ఎంబీ అనుమతులు లేకుండానే! నీటి తరలింపు పక్రియ మూడు రోజులపాటు కొనసాగినా, తెలంగాణ సర్కారుకు పట్టించుకోలేదు. నా లుగు రోజుల తరువాత మేల్కొని ఏపీ నీటి చౌర్యం పై అప్పటికప్పుడు బోర్డుకు ఫిర్యాదు చేస్తూ ఒక లేఖ రాసి చేతులు దులుపుకున్నది. ఇప్పటికీ గోప్యతను పాటిస్తున్నది. దీనిపై ఇప్పటికీ సంబంధిత శాఖ మంత్రి కానీ, ఇతర ప్రభుత్వ పెద్దలు కానీ స్పందించకపోవడం కృష్ణాజలాలపై సర్కారు ఉదాసీనతకు అద్దం పడుతున్నదనే విమర్శలొస్తున్నాయి.
అది కూడా అనుమతుల్లేకుండానే..
మే నెలాఖరు వరకు ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించిన అంశంపై కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ, తెలంగాణ, ఏపీ ఈఎన్సీలతో కూడిన త్రిసభ్య కమిటీ ఈ నెల 12న సమావేశమైంది. నాగార్జునసాగర్ ఎండీడీఎల్‌ను 510 అడుగుల నుంచి 500 అడుగులకు తగ్గించి మొత్తంగా 17.55 టీఎంసీలు వినియోగానికి అందుబాటులో ఉన్నాయని తేల్చారు. అందులో 3.55 టీఎంసీలను భవిష్యత్తు అవసరాలకు మినహాయించి మిగతా 14 టీఎంసీలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయించారు. అయితే అప్పటికే ఏపీ 2.5 టీఎంసీలను వినియోగించుకోగా, ఇక మూడు టీఎంసీలనే వినియోగించుకోవాల్సి ఉన్నది. పులిచింతల వద్ద కృష్ణా డెల్టా తాగునీటి అవసరాలకు నాలుగు టీఎంసీలు కావాలని నాటి త్రిసభ్య కమిటీ సమావేశంలో ఏపీ సర్కారు పట్టుబట్టింది. ఆ మేరకు సాగర్ నుంచి విడుదల చేయాలని ప్రతిపాదిందించింది. కమిటీ నిర్ణయాన్ని ఉల్లంఘించి, త్రిసభ్య కమిటీ సమావేశం మరుసటి రోజునే అంటే 13వ తేదీ నుంచే తన ఆధీనంలో ఉన్న సాగర్ టెయిల్‌పాండ్ నుంచి నాలుగు టీఎంసీలను అక్రమంగా తరలించుకుపోయింది. మూడు రోజుల వరకు ఆ విషయాన్ని గుర్తించలేదంటే తెలంగాణ సర్కారు పర్యవేక్షణ ఎలా ఉన్నదో అర్థమవుతున్నది.
ఎందుకీ గోప్యత?
ఏపీ నీటి చౌర్యం విషయం వెలుగులోకి వచ్చి విమర్శలు వెల్లువెత్తడంతో తెలంగాణ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా కేఆర్ఎంబీకి లేఖ రాసి చేతులు దులుపుకున్నది. బోర్డు అనుమతి లేకుండా టెయిల్‌పాండ్ నుంచి నీటిని విడుదల చేయడం అక్రమమని, అది తెలంగాణకు తీవ్ర నష్టదాయకమని ఫిర్యాదు చేసింది. టెయిల్‌పాండ్‌లో 6.737 టీఎంసీలు ఉండగా, మూడు టీఎంసీలను క్రెస్ట్ గేట్ల ద్వారా 28,930 క్యూసెకుల డిశ్చార్జితో తరలించుకుపోతున్నదని, బోర్డు జోక్యం చేసుకుని నీటి విడుదలను నిలిపివేసేలా చర్య తీసుకోవాలని కోరింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

