Bhopal | ఉగ్రవాదుల అడ్డా భోపాల్.. వీరంతా బీజేపీ ఎన్నికల సైన్యమేనా?
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉగ్రవాదులకు అడ్డాగా మారిందా? అంటే అవుననే చెప్పాలి. మొన్న హెచ్‌యూటీ ఉగ్రవాదుల అరెస్టు.. నిన్న జేఎంబీ సంస్థకు చెం దిన ఉగ్రవాదులు అరెస్టు ఇదే విషయాన్ని రూఢీ పరుస్తున్నాయి.
- రెండుసార్లూ టెర్రరిస్టుల అరెస్టులు
- దిగ్విజయ్ సింగ్ కామెంట్‌తో తొలిగిన అనుమానం
- నోరు మెదపని రాష్ట్ర బీజేపీ నేతలు
Bhopal | హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉగ్రవాదులకు అడ్డాగా మారిందా? అంటే అవుననే చెప్పాలి. మొన్న హెచ్‌యూటీ ఉగ్రవాదుల అరెస్టు.. నిన్న జేఎంబీ సంస్థకు చెం దిన ఉగ్రవాదులు అరెస్టు ఇదే విషయాన్ని రూఢీ పరుస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో రేపు ఏ సంస్థ ఉగ్రవాదులు అరెస్టవుతారో తెలియని పరిస్థితి నెలకొన్నది. అంతలా అక్కడ ఉగ్రమూలాలు వేళ్లూనుకున్నాయి. హెచ్‌యూటీ ఉగ్రవాద సంస్థ మూలాలపై ఆరా తీస్తున్న క్రమంలో ‘జమాత్ ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్’ (జేఎంబీ)కి చెందిన పదిమందిని కేంద్ర నిఘా సంస్థ ఎన్ఐఏ తాజాగా అరెస్టు చేసింది.
విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం జబల్పూర్లోని 13 ప్రాం తాల్లో ఎన్ఐఏ సోదాలు చేసి, జేఎంబీ ఉగ్రసంస్థకు చెందిన వారిని అరెస్టు చేసింది. ఇదే నెలలో హిజ్బ్ ఉత్ తహ్రీర్‌కు చెందిన 16 మందిని తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, భోపాల్ యాంటీ టెర్రరిస్టు స్కాడ్ పోలీసు లు అరెస్టు చేశారు. హెచ్‌యూటీ ఇస్లామిస్టుల సమాచారంతోనే జేఎంబీ ఉగ్రవాదులను అరెస్టు చేశారు. అరెస్టు అయినవారి నుంచి తీగ లాగితే.. ఏ ఉగ్రవాద సంస్థ డొంక కదులుతుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొన్నది.
ఇదంతా బీజేపీ సైన్యమేనా?
ఏ రాష్ర్టానికి ఎన్నికల షెడ్యూల్ వచ్చినా సరిహద్దుల్లో సైన్యం చనిపోవటం.. కశ్మీర్లో తీవ్రవాదులపై దాడులు వంటివి చూస్తుం టాం. ఇది బీజేపీ ఎన్నికల స్టంట్ అని ప్రజలకు తెలిసిన విషయమే. మరికొన్ని నెలల్లో బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. అక్కడ ఉగ్రవాదుల సాకు చూ పి, ఎన్నికల్లో గెలువాలనే దుర్బుద్ధితో కొంద రు బీజేపీ నేతలు ఉగ్రవాద సంస్థలను పెంచిపోషిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేపీ, బజరంగదళ్ వంటి సంస్థలకు చెందిన కొందరు కార్యకర్తలు పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నట్టు తమకు సమాచారం ఉన్నదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే.. వారిని అరెస్టు చేసి, జైలుకు పంపుతామని ఎంపీ దిగ్విజయ్‌సింగ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఎన్నో అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
తేలుకుట్టిన దొంగల్లా బీజేపీ నేతలు!
ఇటీవల హైదరాబాద్‌లో భోపాల్‌కు చెందిన ఉగ్రవాదులను అరెస్టు చేస్తే.. బోడిగుండుకు, మోకాలికి లింకుపెట్టి మాట్లాడిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్.. మధ్యప్రదేశ్‌లో జేఎంబీ ఉగ్రవాదుల అరెస్టుతో తేలుకుట్టిన దొంగలా కిక్కురుమనకుండా ఉన్నారని పలువురు తెలంగాణవాదులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉగ్రవాద సంస్థలకు అందుతున్న నిధులపై సక్రమంగా ఆరా తీస్తే.. ఏ పార్టీ లింకులు బయటపడతాయో వేచి చూడాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

