హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు జన్మదిన వేడుకలను బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. సిద్దిపేటలోని ఆయన నియోజకవర్గం, హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో కేక్‌లు కట్ చేసి, స్వీట్లు పంచారు. నిండూనూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. యూకేలోని ప్రెస్టన్‌లో బీఆర్ఎస్ నేత బాణాల పవన్‌రావు ఆధ్వర్యంలో బర్త్‌డే సెలబ్రేషన్స్ జరిగాయి. బీఆర్ఎస్వీ(నాగార్జునసాగర్), బీఆర్ఎస్ యూకే నేతలు పెద్దసంఖ్యలో హాజరై భారీ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూకే నాయకులు మాట్లాడారు. శివసాయి, మహేందర్, వరుణ్, హరికృష్ణ, పవన్, అక్షయ్, రవి, ఉమాకాంత్, సమరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పూరీ బీచ్‌లో లలితాసోమిరెడ్డి ఆధ్వర్యంలో గులాబీ జెండాల నడుమ హరీశ్‌రావు సైకత శిల్పాన్ని ఏర్పాటుచేసి అభిమానం చాటుకున్నారు. ‘వర్ధిల్లు.. వందేండ్లు’అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. హరీశ్‌రావుకు బర్త్‌డే గ్రీటింగ్స్ చెప్పారు. బుధవారం సాయంత్రం మండలి విప్ దేశపతి శ్రీనివాస్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో కలిసి కోకాపేటలోని ఆ యన నివాసానికి వెళ్లగా పుష్పగుచ్ఛం అం దజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపా రు. సంపూర్ణ ఆరోగ్యంతో సుదీర్ఘకాలం ప్ర జాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.
అభిమానులు, శ్రేయోభిలాషులు, పార్ట కార్యకర్తల సమక్షంలో హరీశ్‌రావు తన జన్మదిన వేడుకలను హైదరాబాద్ కోకాపేటలోని తన నివాసంలో ఘనంగా జరుపుకొన్నారు. ఆయన గ్రీటింగ్స్ చెప్పిన వారిలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, రాష్ట్ర నేతలు చిరుమర్తి లింగయ్య, కూచుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కర్నాటి విద్యాసాగర్, గోసుల శ్రీనివాస్ యాదవ్, అభిలాష్ రంగినేని, కిశోర్‌గౌడ్, నరోత్తమ్, ఆదర్శ్‌రెడ్డి, బండా నరేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.