రైతుబీమా అమలు చేయకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తం
ఆపద సమయంలో ఆదుకొనే రైతుబీమా పథకాన్ని వెంటనే అమలుచేయకపోతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు హెచ్చరించారు. రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ, కేసీఆర్ అమలుచేసిన సంక్షేమ పథకాలను నిలిపివేసి వాళ్ల ఉసురుపోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
- పథకం బంద్ పెట్టి అన్నదాతల ఉసురు పోసుకుంటున్న సర్కార్
- రేవంత్‌రెడ్డి తీరు వల్ల 3వేల రైతు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి
- బాధిత కుటుంబాలకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
- యథావిధిగా రైతుబీమా పథకాన్ని అమలుచేయాలి
- లేకపోతే సీఎం ఇల్లు, సెక్రటేరియట్‌ను ముట్టడిస్తం
- బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ టీ హరీశ్‌రావు స్పష్టం
- 22మంది రైతుబీమా రాని కుటుంబాలతో సమావేశం
సిద్దిపేట, అక్టోబర్ 15 : ఆపద సమయంలో ఆదుకొనే రైతుబీమా పథకాన్ని వెంటనే అమలుచేయకపోతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు హెచ్చరించారు. రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ, కేసీఆర్ అమలుచేసిన సంక్షేమ పథకాలను నిలిపివేసి వాళ్ల ఉసురుపోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నియోజకవర్గంలో రైతుబీమా అందని 22 మంది కుటుంబాలతో గురువారం సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ ఆగస్టు 15నుంచి ఇప్పటివరకు ఒక సిద్దిపేటలో 22మంది, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3వేల మంది రైతులు మృతిచెందారని, ప్రభుత్వం రైతుబంధు నిలిపివేయడం వల్ల ఆ మూడు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు.
రైతుబీమా అమలు చేసి ఉంటే అన్ని కుటుంబాలు ఎందుకు కన్నీళ్లు పెడుతాయని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆగస్టు 14నుంచి ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించకపోవడం వల్లే రాష్ట్రంలో రైతుబీమా ఆగిపోయిందని చెప్పారు. మరి ఇప్పుడు వారికి ఏం సమాధానం చెబుతారని, ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఐక్యరాజ్యసమితి సైతం మెచ్చుకున్న రైతు బీమా పథకాన్ని నిలిపివేయడానికి ప్రభుత్వానికి మనసెలా వచ్చిందని ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాలు మన పథకాన్ని చూసి అమలు చేస్తుంటే.. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బంద్ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతు సంక్షేమం గురించి గొప్పలు చెప్పే రేవంత్‌రెడ్డికి రూ.1,400 కోట్ల ప్రీమియం చెల్లించే తెలివి లేదా? అని ప్రశ్నించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన 3వేల మంది రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ వెంటనే రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించి యథావిధిగా రైతు బీమా పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే రైతు కుటుంబాలతో కలిసి సీఎం ఇంటిని, సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతు కుటుంబాలు ఆందోళన చెందవద్దని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అసెంబ్లీ వేదికగా రైతు బీమా అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, బీమా డబ్బులు వచ్చేలా చేస్తామని చెప్పారు.
ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
ఎన్హెచ్ఎం ఉద్యోగులు, ఆయుష్ ఉద్యోగులు, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని, వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అమలును విస్మరించిందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. గురువారం సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట నిరవధిక సమ్మె చేస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులకు ఆయన సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేండ్లు కావస్తున్నా ఆ హామీల అమలుచేయకపోవడంతో ఉద్యోగులు నిరాశకు గురవుతున్నట్టు తెలిపారు. 15వ తేదీ వచ్చినా వారికి వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో 1న వేతనాలు ఇచ్చినట్టు గుర్తుచేశారు. వెంటనే ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హత ప్రకారం జీపీఎఫ్, ఈఎస్ఐ ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.
స్కావెంజర్ల సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తా..
సావెంజర్ల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి పరిష్కారానికి కృషిచేస్తానని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. సిద్దిపేటలో సమ్మెచేస్తున్న స్కావెంజర్లకు గురువారం సంఘీభావం తెలిపారు. సమస్యలను కలెక్టర్, మంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. పది నెలల వేతనాలు పెండింగ్‌లో ఉండటం బాధాకరం, దసరా పండుగలోపు బకాయిలు విడుదలయ్యేలా కృషిచేస్తానని వారికి భరోసా ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

