18న ‘టిఫా’ యంత్రాలు ప్రారంభం
గర్భిణుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 56 అత్యాధునిక ‘టిఫా’ స్కానింగ్ యంత్రాలను ఈ నెల 18న ప్రారంభించనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. వీటితోపాటు కంటి చికిత్సలకు ఉపయోగించే 26 ఆపరేటివ్ మైక్రోస్కోప్‌లను కూడా ప్రారంభించనున్నట్టు తెలిపారు. వీటన్నింటినీ ఆన్లైన్ ద్వారా ఒకేసారి ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
- 26 ఆపరేటివ్ మైక్రోస్కోప్‌లు కూడా
- ఈ ఏడాది చివరికి బస్తీ దవాఖానల పనులు పూర్తి
- వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు వెల్లడి
- అభివృద్ధి పనులపై సమీక్ష
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): గర్భిణుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 56 అత్యాధునిక ‘టిఫా’ స్కానింగ్ యంత్రాలను ఈ నెల 18న ప్రారంభించనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. వీటితోపాటు కంటి చికిత్సలకు ఉపయోగించే 26 ఆపరేటివ్ మైక్రోస్కోప్‌లను కూడా ప్రారంభించనున్నట్టు తెలిపారు. వీటన్నింటినీ ఆన్లైన్ ద్వారా ఒకేసారి ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
టీఎస్ఎంఎస్ఐడీసీ, ఎన్హెచ్ఎం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి హరీశ్‌రావు సోమవారం నెలవారీ సమీక్ష నిర్వహించారు. తల్లీబిడ్డల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నదని, అందులో భాగంగా ప్రభుత్వ దవాఖానల్లో టిఫా యంత్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. దీంతో ఇకపై గర్భిణులు పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్‌లకు వెళ్లాల్సిన అవసరమే ఉండదన్నారు. అన్ని రకాల స్కానింగ్‌లను ప్రభుత్వ దవాఖానల్లో, థైరాయిడ్ లాంటి పరీక్షలను టీ-డయాగ్నస్టిక్స్ ద్వారా ఉచితంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాస్‌రావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శ్వేతా మహంతి, సీఎం ఓఎస్డీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు పలు ఆదేశాలు
- గాంధీ, నిమ్స్, జహీరాబాద్, హుస్నాబాద్, మలాజిగిరి, కామారెడ్డిలో మాతా -శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు పనులను త్వరగా పూర్తిచేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.
- టీవీవీపీ పరిధిలోని 32 దవాఖానల ఉన్నతీకరణతో పాటు 13 జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాల పనులను వేగవంతం చేయాలన్నారు.
- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేస్తున్న 41 బస్తీ దవాఖానలను డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.
- జిల్లాల్లో బస్తీ దవాఖానల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని తెలిపారు.
- జీవన్ దాన్ ద్వారా అవయవ మార్పిడులు పెంచేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

