స్కీముల సర్కార్ మళ్లీ రావాలి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త సీములేమీ రాలేదని, అన్నీ సాములేనని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. ఈ సాముల సర్కార్ పోయి మళ్లీ సీముల సర్కార్ రావాలని పేర్కొన్నారు.
- కాంగ్రెస్ పాలనలో అన్నీ స్కాములే.. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు
సిద్దిపేట, జూన్ 25: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్తస్కీములేమీ రాలేదని, అన్నీ స్కాములేనని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. ఈ స్కాముల సర్కార్ పోయి మళ్లీ స్కీముల సర్కార్ రావాలని పేర్కొన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని 29వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఎస్ఐఆర్పై బీఆర్ఎస్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ నెలకు రూ.4వేల పెన్షన్ ఇస్తామని 31నెలలుగా మోసం చేస్తున్న రేవంత్‌రెడ్డి.. ఒకో అవ్వాతాతలకు, బీడీ కార్మికురాలికి ఏకంగా రూ.62,000 బాకీ పడ్డాడని, అవి ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. సర్కార్ దవాఖానలో కాన్పు అయితే కేసీఆర్ కిట్ కింద రూ.12వేలు ఇచ్చి తల్లీబిడ్డను ఇంటి వద్ద దింపే సీమ్ తీసుకొస్తే కాంగ్రెస్ సర్కార్ బంద్ పెట్టిందని మండిపడ్డారు.
మహిళలకు రూ.2,500 ఇస్తామని, కల్యాణలక్ష్మీతో పాటు పెండ్లికి తులం బంగారం ఇస్తామని.. ఇలా అన్నీ మోసాలే చేశారని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు కేవలం ఓట్ల కోసమే వస్తారని కానీ, ఏ పండుగైనా, కష్టమైనా నిరంతరం మీ మధ్యే ఉంటూ మీ ఇంట్లో అన్నదమ్ముల్లా, అకాచెల్లెళ్లలా ఉండేది బీఆర్ఎస్ నాయకులు మాత్రమేనని చెప్పారు.
ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలి
ఎస్ఐఆర్పై బీఆర్ఎస్ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. బూత్ లెవల్ ఏజెంట్స్ క్రియాశీలంగా పనిచేయాలన్నారు. ప్రతి ఓటరునూ కలువాలని, ప్రతి గడపనూ తట్టాలని సూచించారు. ఈ ప్రక్రియ రెండు నెలల పాటు ఉంటుందని, 18 ఏండ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకొనేలా అవగాహన కల్పించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

