Harish Rao | అశాంతి.. అలజడితో అట్టుడుకుతున్న రాష్ట్రం: హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డి అపరిపక్వ వైఖరితో తెలంగాణ ప్రగతి మసకబారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. అశాంతి, అలజడితో రాష్ట్రం అట్టుడుకుతున్నదని ధ్వజమెత్తారు. సీఎం నిర్వహిస్తున్న శాఖల్లోనూ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని ఆరోపించారు
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అపరిపక్వ వైఖరితో తెలంగాణ ప్రగతి మసకబారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. అశాంతి, అలజడితో రాష్ట్రం అట్టుడుకుతున్నదని ధ్వజమెత్తారు. సీఎం నిర్వహిస్తున్న శాఖల్లోనూ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై ‘ఏడాది పాలన-ఎడతెగని వంచన’ పేరుతో బీఆర్ఎస్ ఛార్జిషీట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముగ్గురు మంత్రులున్నా ఖమ్మంలో వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే రాళ్ల దాడి చేశారని తెలిపారు.
కాంగ్రెస్ వచ్చిన ఏడాది కాలంలో రోడ్డెక్కని రంగమే లేదు. బడి పిల్లల నుంచి పింఛన్లు అందుకునే అవ్వాతాతల వరకు అందర్నీ నడిరోడ్డు మీదికి ఈడ్చారని చెప్పారు. ఆరు గ్యారంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించారని, అమలు చేయకుండా అన్ని వర్గాలకు అన్యాయం చేశారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందన్నారు మండిపడ్డారు. అశాంతి, అలజడితో రాష్ట్రం అట్టుడుకున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో 9 చోట్ల మత కలహాలు జరిగాయని విమర్శించారు. హైడ్రా పేరుతో కూల్చివేతలు ప్రారంభించి అరాచకం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం విక్రయాలు పెంచాలని మెమోలు ఇచ్చారని చెప్పారు. గాంధీభవన్‌లో వచ్చే సూచనల ఆధారంగా చట్టాలు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఆఖరికి దేవుళ్లను కూడా మోసం చేశాడని, అందుకే భూకంపం వచ్చిందని తనతో కొందరు అనట్లు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

