Harish Rao | సొంతశాఖలో విషయాలపై అవగాహన లేక.. రాజకీయాలకు పనికిరారనడం తగునా..? : హరీశ్‌రావు
Harish Rao | విద్యుత్ పై అసెంబ్లీ సాక్షిగా మీరు విడుదల చేసిన స్టేట్ పవర్ సెక్టార్ శ్వేతపత్రం, ఇటీవల విడుదల చేసిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025, ఇవాళ పీపీటీలో ప్రదర్శించిన చెప్పిన విద్యుత్ గణాంకాలు ఒక దానికి మరొకటి పొంతన లేకుండా ఉన్నాయనే కనీస అవగాహన మీకుందా? అంటూ మంత్రి భట్టి విక్రమార్కను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు.
Harish Rao | విద్యుత్ పై అసెంబ్లీ సాక్షిగా మీరు విడుదల చేసిన స్టేట్ పవర్ సెక్టార్ శ్వేతపత్రం, ఇటీవల విడుదల చేసిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025, ఇవాళ పీపీటీలో ప్రదర్శించిన చెప్పిన విద్యుత్ గణాంకాలు ఒక దానికి మరొకటి పొంతన లేకుండా ఉన్నాయనే కనీస అవగాహన మీకుందా? అంటూ మంత్రి భట్టి విక్రమార్కను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. డిప్యూటీ సీఎంగా, విద్యుత్ మంత్రిగా రెండేళ్లు పూర్తయినప్పటికీ.. సొంత శాఖలోని విషయాలపై మీకు ఏమాత్రం అవగాహన లేకున్నప్పటికీ ఇతరులను అన్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని కామెంట్ చేయడం మీకు తగునా? అంటూ నిలదీశారు.
మీ అధికారులు ఒక్కో సారి, ఒక్కో లెక్కలతో.. మీ చేతుల మీదుగానే ఆవిష్కపరింప చేస్తున్నారంటే మీ శాఖపై మీకు కనీస అవగాహన కూడా లేదన్నది స్పష్టంగా తెలుస్తుందని.. ప్రభుత్వానికి కమీషన్లపై ఉన్న శ్రద్ద, పాలసీలపై ఉండి ఉంటే.. ఈ పొరపాట్లు జరగవు కదా? అంటూ సెటైర్లు వేశారు. ‘ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా లెక్కలు చెబుతున్నారన్న విషయం కూడా మంత్రికే తెలియదని.. మీరు రెండు సంవత్సరాలుగా విడుదల చేసినవి ఏమిటో, ఇప్పుడు చెబుతున్నవి ఏమిటో అందులో కొన్ని మచ్చుకు వివరిస్తున్నాను’ అంటూ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టారు.
విద్యుత్ పై అసెంబ్లీ సాక్షిగా మీరు విడుదల చేసిన స్టేట్ పవర్ సెక్టార్ శ్వేతపత్రం,
ఇటీవల విడుదల చేసిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025,
ఈరోజు మీరు పీపీటీలో ప్రదర్శించిన చెప్పిన విద్యుత్ గణాంకాలు ఒక దానికి మరొకటి పొంతన లేకుండా ఉన్నాయనే కనీస అవగాహన మీకుందా @Bhatti_Mallu గారూ..… pic.twitter.com/f3NNMGIkuh— Harish Rao Thanneeru (@BRSHarish) November 29, 2025
మంత్రి @OffDSB శ్రీధర్ బాబు గారూ.. అధికారులు ఏదో రాసి దాన్ని గుడ్డిగా చదివినట్లున్నారు. మీరు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన శ్వేతపత్రం పేజీ నెం.11లో ఏముందో ఒక్క సారి చూసుకోండి.
యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కోల్ ట్రాన్స్ పోర్టుకు ఏడాదికి రూ. 803 కోట్లు కావాలని శ్వేతపత్రంలో పెట్టింది…— Harish Rao Thanneeru (@BRSHarish) November 29, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

