Harish Rao | ఓ మహాత్మా మన్నించు.. గాంధీ ఆశయాలే పట్టని కాంగ్రెస్‌కు.. గాంధీ విగ్రహం ఎలా కనిపిస్తుంది: హరీశ్‌రావు
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తా, తుడిచేస్తా అనే కురచ బుద్ధితో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి జాతిపిత గాంధీజీ కూడా టార్గెట్ అయినట్టున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. గాంధీ పేరు చెప్పి రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోవడమే తప్ప, ఆయన పట్ట, ఆయన సిద్ధాంతాల పట్ల కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఏమాత్రం గౌరవం లేదని మండిపడ్డారు.
హైదరాబాద్: కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తా, తుడిచేస్తా అనే కురచ బుద్ధితో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి జాతిపిత గాంధీజీ కూడా టార్గెట్ అయినట్టున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. గాంధీ పేరు చెప్పి రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోవడమే తప్ప, ఆయన పట్ట, ఆయన సిద్ధాంతాల పట్ల కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఏమాత్రం గౌరవం లేదని మండిపడ్డారు. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనేది గాంధీ గారి సిద్ధాంతం అయితే, రేవంత్ రెడ్డిది చెడు విను, చెడు చూడు, చెడు మాట్లాడు అనే సిద్ధామని ధ్వజమెత్తారు. అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేయడానికి ఆయన అనుసరిస్తున్న మూల సూత్రం ఇదేనని విమర్శించారు.
సికింద్రాబాద్ గాంధీ దవాఖాన ముందు ఉన్న విగ్రహాన్ని చూసుకోవడం చేదకానీ బాపు ఘాట్ పునరుద్ధరిస్తామని బడాయి కొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ ఆశయాలే పట్టని కాంగ్రెస్ పార్టీకి, గాంధీ విగ్రహం ఎలా కనిపిస్తుందన్నారు. నాడు ఎంతో ఆడంబరంగా ఆవిష్కరించుకున్న గాంధీ విగ్రహం.. నేడు నిర్వహణ లేక ఈ స్థితిలో ఉండటం బాధకరమని చెప్పారు. ఓ మహాత్మా మన్నించు అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
‘అక్టోబర్ 2, 2022 గాంధీ జయంతిని పురస్కరించుకొని నాడు సీఎంగా ఉన్న కేసీఆర్ గారు గాంధీ ఆసుపత్రి ముందు ఆవిష్కరించిన గాంధీ గారి కాంస్య విగ్రహం ఇది. కెసిఆర్ ఆనవాళ్లు చెరిపేస్తా, తుడిచేస్తా అనే కురచ బుద్ధితో ఉన్న సిఎం రేవంత్ రెడ్డికి జాతిపిత గాంధీజీ కూడా టార్గెట్ అయినట్టున్నారు. గాంధీ పేరు చెప్పి రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోవడమే తప్ప, ఆయన పట్ల, ఆయన సిద్ధాంతాల పట్ల కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఏమాత్రం గౌరవం లేదు. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనేది గాంధీ గారి సిద్ధాంతం అయితే, రేవంత్ రెడ్డి ది చెడు విను, చెడు చూడు, చెడు మాట్లాడు అనే సిద్దాంతం. అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేయడానికి ఆయన అనుసరిస్తున్న మూల సూత్రం ఇదే.
గాంధీ ఆశయాలే పట్టని కాంగ్రెస్ పార్టీకి, గాంధీ విగ్రహం ఎలా కనిపిస్తుంది. ఉన్న గాంధీ విగ్రహాన్ని చూసుకోవడం చేత కాదు, కానీ బాపు ఘాట్ పునరుద్దరిస్తమని బడాయి కొడుతున్నడు. ఆనాడు ఎంతో ఆడంబరంగా ఆవిష్కరించుకున్న గాంధీ విగ్రహం, నేడు నిర్వహణ లేక ఈ స్థితిలో ఉండటం బాధాకరం. ఓ మహాత్మా మన్నించు!’ అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

