Harish Rao | కేసీఆర్.. తెలంగాణ జనం గుండెల్లో నిత్య సూర్యోదయం: హరీశ్‌రావు
కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్వేగం, ఉద్రేకం, తెలంగాణ స్వాభిమానం, జై తెలంగాణ యుద్ధ నినాదం, తెలంగాణ సమున్నత అస్తిత్వం అన్నారు. తెలంగాణ ప్రజా ఉద్యమ పటుత్వం, తెలంగాణ ఆవేశాల అగ్నితత్వం, తెలంగాణ అనురాగాల అమృతత్వం, తెలంగాణ ప్రజాగళం, తెలంగాణ ఆత్మగౌరవ రణం, తెలంగాణ నూతన రాష్ట్ర ఆవిష్కరణం, తెలంగాణ రాష్ట్ర అభ్యుదయం, తెలంగాణ జనం గుండెల్లో నిత్య సూర్యోదయం.. కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రధాత, స్వరాష్ట్ర విధాత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 71వ పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్వేగం, ఉద్రేకం, తెలంగాణ స్వాభిమానం, జై తెలంగాణ యుద్ధ నినాదం, తెలంగాణ సమున్నత అస్తిత్వం అన్నారు. తెలంగాణ ప్రజా ఉద్యమ పటుత్వం, తెలంగాణ ఆవేశాల అగ్నితత్వం, తెలంగాణ అనురాగాల అమృతత్వం, తెలంగాణ ప్రజాగళం, తెలంగాణ ఆత్మగౌరవ రణం, తెలంగాణ నూతన రాష్ట్ర ఆవిష్కరణం, తెలంగాణ రాష్ట్ర అభ్యుదయం, తెలంగాణ జనం గుండెల్లో నిత్య సూర్యోదయం.. కేసీఆర్ అని చెప్పారు.
మీరు నా తలనిమిరే తల్లిప్రేమ, నాకు ఎనలేని మమకారం పంచిన మేనమామ. నాకు రాజకీయ చైతన్యాన్ని నేర్పించి, నాలో ప్రజా సేవా సంస్కారాన్ని రంగరించి, నన్ను ఉద్యమ కార్యాచరణలో నడిపించి.. నాలోని నాయకత్వ గుణాన్ని ప్రేరేపించి, నాకు పరిపాలనా సామర్థ్యాన్ని కల్పించి, నన్ను చరితార్థుణ్ణి చేశారని తెలిపారు. మీరు శత వసంతాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
‘‘కేసీఆర్ తెలంగాణ ఉద్వేగం
కేసీఆర్ తెలంగాణ ఉద్రేకం
కేసీఆర్ తెలంగాణ స్వాభిమానం
కేసీఆర్ జై తెలంగాణ యుద్ధ నినాదం
కేసీఆర్ తెలంగాణ సమున్నత అస్తిత్వం
కేసీఆర్ తెలంగాణ ప్రజా ఉద్యమ పటుత్వం
కేసీఆర్ తెలంగాణ ఆవేశాల అగ్నితత్వం
కేసీఆర్ తెలంగాణ అనురాగాల అమృతత్వం
కేసీఆర్ తెలంగాణ ప్రజాగళం
కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవ రణం
కేసీఆర్ తెలంగాణ నూతన రాష్ట్ర ఆవిష్కరణం
కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభ్యుదయం
కేసీఆర్ తెలంగాణ జనం గుండెల్లో నిత్య సూర్యోదయం
మీరు నా తలనిమిరే తల్లిప్రేమ
నాకు ఎనలేని మమకారం పంచిన మేనమామ
నాకు రాజకీయ చైతన్యాన్ని నేర్పించి
నాలో ప్రజా సేవా సంస్కారాన్ని రంగరించి
నన్ను ఉద్యమ కార్యాచరణలో నడిపించి
నాలోని నాయకత్వ గుణాన్ని ప్రేరేపించి
నాకు పరిపాలనా సామర్థ్యాన్ని కల్పించి
నన్ను చరితార్థుణ్ణి చేసిన మీరు
శత వసంతాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.’ అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

