రేవంత్ సర్కార్ జాబ్ రాకెట్!
జర్మనీ ఉద్యోగాల పేరిట రేవం త్ ప్రభుత్వం తెలంగాణ నిరుద్యోగులను దారుణంగా మోసగించిందని, ప్రభుత్వరంగ సంస్థ టామ్కామ్ను తన దోపిడీకి రాకెట్‌గా మార్చేసిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలోని 15 జిల్లాలకు చెందిన 70 నుంచి 75 మంది యువకుల నుంచి ఉద్యోగాలతో పాటు పరీక్షలు, బీమా, వీసా ఖర్చు లు కలిపి ఒకొకరి నుంచి రూ.4.5 లక్షల చొప్పున వసూలు చేసినట్టు ఆదివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రెండేండ్లు గడిచినా నిరుద్యోగ యువతకు జర్మనీలో ఉద్యోగావకాశాలు కల్పించలేదని తెలిపారు.
- జర్మనీలో ఉద్యోగాలని నిరుద్యోగులకు ఆశలు
- ఒకొకరి నుంచి రూ.4.5 లక్షల వసూలు
- రెండేండ్లు గడిచినా ఇంకా దక్కని కొలువులు
- వసూలు చేసిన ప్రతి పైసా తిరిగి ఇవ్వాలి
- శ్వేతపత్రం ఇవ్వాలి : హరీశ్‌రావు డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ): జర్మనీ ఉద్యోగాల పేరిట రేవం త్ ప్రభుత్వం తెలంగాణ నిరుద్యోగులను దారుణంగా మోసగించిందని, ప్రభుత్వరంగ సంస్థ టామ్కామ్ను తన దోపిడీకి రాకెట్‌గా మార్చేసిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలోని 15 జిల్లాలకు చెందిన 70 నుంచి 75 మంది యువకుల నుంచి ఉద్యోగాలతో పాటు పరీక్షలు, బీమా, వీసా ఖర్చు లు కలిపి ఒకొకరి నుంచి రూ.4.5 లక్షల చొప్పున వసూలు చేసినట్టు ఆదివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రెండేండ్లు గడిచినా నిరుద్యోగ యువతకు జర్మనీలో ఉద్యోగావకాశాలు కల్పించలేదని తెలిపారు. తమకు జరిగిన అన్యాయంపై తాజాగా మీడియా ముందుకొచ్చిన 24 మంది అభ్యర్థుల్లో ఒకరికి కూడా కనీసం ఏ ఒక జర్మన్ దేశ సంస్థ కూడా ఇంటర్వ్యూలు నిర్వహించలేదని తెలిపారు.
ఈ విషయంలో నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం నమ్మించి గొంతుకోసిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నమ్మి పేద కుటుంబాలు తెచ్చిన అప్పులకు నేటికీ వడ్డీలు చెల్లిస్తూ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. మొదట జర్మన్ భాష బీ-1 లెవెల్ పూర్తి చేయాలని చెప్పిన అధికారులు, తీరా అది ఉత్తీర్ణత సాధించాక బీ-2 పరీక్ష కూడా రాయాలంటూ నిబంధనలు మార్చి కాలయాపన చేశారని దుయ్యబట్టారు. మరోవైపు, 9 మంది యువకులు ‘జర్మనీ వెళ్లడానికి సర్వం సిద్ధం’ అంటూ స్వయంగా ప్రభుత్వ ప్రచారం ప్రకటనలు వెలువరించినా, వాస్తవానికి వారిలో ఒకరిని కూడా ఇప్పటికీ విదేశాలకు పంపలేదని చెప్పారు.
మళ్లీ కొత్త బ్యాచ్ ప్రారంభం
బాధిత 70 కుటుంబాలు రెండేండ్లుగా దికుతోచని స్థితిలో న్యాయంకోసం వేచి చూస్తున్నారని, వారి సమస్యలను గాలికొదిలి గత జూన్ నెలలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మళ్లీ విదేశీ ఉద్యోగాల పేరిట కొత్త బ్యాచ్‌ను ప్రారంభించి అబద్ధపు హామీలు ఇవ్వడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ వ్యవహారంలో న్యాయపరమైన వివాదం వస్తే బాధితులు వెయ్యి కి లోమీటర్ల దూరంలో ఉన్న లక్నో కోర్టు పరిధిలోనే తేల్చుకోవాలంటూ అగ్రిమెంట్లపై బలవంతంగా సంతకాలు చేయించుకోవడం పెద్ద కుట్ర దాగి ఉన్నదని చెప్పారు.
నిరుద్యోగుల పక్షాన పోరాటం
జర్మనీ ఉద్యోగాల పేరిట జరిగిన భారీ కుంభకోణంపై బాధిత నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని హరీశ్‌రావు స్పష్టంచేశారు. టామ్‌కామ్, ఫెయిర్స్ట్రీట్ ఇండియా సంస్థలు నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన ప్రతి పైసానూ వెంటనే వెనకి చెల్లించాలని, గడిచిన రెండేండ్ల సమయం, వడ్డీల భారం, మానసిక వేదనను పరిగణనలోకి తీసుకుని బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించాలని, బాధితులందరికీ ప్రభుత్వమే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని, దీనిపై వెంటనే సీఐడీ లేదా న్యాయ విచారణ జరిపించి దోషులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన ఫీజులు చెల్లించాలని, విదేశీ ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

