హరే కృష్ణ ట్రస్ట్ సేవలు అద్భుతం : మంత్రి హరీశ్ రావు
సంగారెడ్డి అర్బన్, జూలై 31 : హరే కృష్ణ ట్రస్టు ద్వారా అందిస్తున్న సేవలుఅద్భుతమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి రోజు 65వేల మందికి ఉచితంగా భోజనాలు అందిస్తూ ఆకలి తీరుస్తుందన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని అక్షయపాత్ర మెగా కిచెన్ ఆవరణలో కృష్ణ మందిరం, సాంస్కృతిక కేంద్ర నిర్మాణ పనులకు మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హరే కృష్ణ ఫౌండేషన్ సభ్యులు ఎలాంటి తారతమ్యం లేకుండా ఆకలితో అలమటిస్తున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా భోజనాలు అందించండం చాల గొప్ప విషయమన్నారు.
విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఆపదలో ఉన్నవారు, దవాఖానలో సహాయకులకు, పట్టణాల్లో వలస కార్మికులు ఇలా లక్షల మందికి భోజనాలు అందిస్తున్న ఘనత ఈ ఫౌండేషన్‌కు దక్కడం అద్భుతమని ప్రశంసించారు. హరే కృష్ణ ఫౌండేషన్ చేసే సేవలో తనవంతు సహాయ సహకారలు ఎల్లప్పుడు అందించేందుకు ముందుంటానని మంత్రి హామినిచ్చారు.
కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కంది గ్రామ సర్పంచ్ విమల, ఎంపీపీ సరళ, జెడ్పీటీసీ కొండల్‌రెడ్డి, సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, హరేకృష్ణ ఫౌండేషన్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

