Nalgonda | కాంగ్రెస్ నాయకుల వేధింపులు.. ఠాణాలో బీఆర్ఎస్ నేత ఆత్మహత్యాయత్నం
న్యాయం చేయాల్సిన పోలీసులే కాంగ్రెస్ నాయకులను కాపాడేందుకు తనను వేధిస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు.
- కాంగ్రెస్‌కు పోలీసుల వత్తాసు
- ఫిర్యాదు చేస్తే తనపైనే కేసు నమోదు చేశారని ఆవేదన
- పోలీస్‌స్టేషన్‌లోనే పురుగుల మందు తాగి సెల్ఫీ వీడియో
- డీఎస్పీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్, గిరిజనుల ధర్నా
Nalgonda | దామరచర్ల, జూన్ 26: న్యాయం చేయాల్సిన పోలీసులే కాంగ్రెస్ నాయకులను కాపాడేందుకు తనను వేధిస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. తనకు ప్రాణహాని ఉందని, ఎస్పీ రక్షించాలని వేడుకున్నాడు. నల్లగొండ జిల్లా వాడపల్లి పోలీస్‌స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనకు ముందు బాధితుడు సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వినిపించాడు. దామరచర్ల మండలంలోని గణేశ్పాడు గ్రామ మాజీ సర్పంచ్ రమావత్ జ్యోతి భర్త సైదానాయక్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడులు చేయడంతో ఆస్పత్రిపాలైనట్టు సైదానాయక్ వీడియోలో పేర్కొన్నారు. పార్లమెంట్ పోలింగ్ రోజున డీసీసీ ప్రెసిడెంట్ శంకర్‌నాయక్ పోలింగ్ బూత్ దగ్గర తనను కొట్టాడని వాపోయాడు.
తనపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని మే 13న వాడపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు సైదానాయక్ తెలిపారు. నెల రోజులు గడిచినా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదని, న్యాయం కోసం పలుమార్లు పోలీస్‌స్టేషన్‌కు తిరిగినా ఎస్ఐ కనీస విచారణ చేయలేదని చెప్పాడు. పైగా తనమీదే కేసు నమోదు చేశారని, పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని.. ఎస్పీ రక్షించాలని వేడుకున్నాడు. ఈ క్రమంలోనే వాడపల్లి స్టేషన్‌కు చేరుకుని వెంట తీసుకెళ్లిన పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు గమనించి చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సైదానాయక్‌ను డీసీఎంఎస్ మాజీ వైస్‌చైర్మన్ డీ నారాయణరెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ వీరకోటిరెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి డీ వెంకటేశ్వర్లు, గిరిజన నాయకులు ఆంగోతు హాతీరాంనాయక్, ప్రకాశ్‌నాయక్, సచిన్‌నాయక్, పాచ్యూనాయక్, చిట్టిబాబునాయక్ పరామర్శించారు. ఈ ఘటనపై వాడపల్లి ఎస్ఐ ఇరుగు రవిని వివరణ కోరగా.. సైదానాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశామని, మరొక కేసును కోర్టు దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అనుమతి వచ్చిన వెంటనే కేసు నమోదు చేయనున్నట్టు చెప్పారు.
డీఎస్సీ కార్యాలయం ఎదుట ధర్నా
పోలీస్‌స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రమావత్ సైదానాయక్‌కు న్యా యం చేయాలని బీఆర్ఎస్ పార్టీ, సేవాలాల్ సంఘం ఆధ్యర్యంలో మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయం ఎదుట బుధవారం రాత్రి ధర్నా నిర్వహించారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని నాయకులు మండిపడ్డారు. డీఎస్సీ రాజశేఖర్‌రాజు సైదానాయక్ సతీమణి జ్యోతితోపాటు ఇతర నాయకులను పిలిచి ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని హామీని ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

