పాలిటెక్నిక్‌లో లైంగిక వేధింపుల కలకలం
విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన విద్యాసంస్థల్లో వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
- విద్యార్థినులపై ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన
- హాస్టల్‌కు వెళ్లి వేధింపులు.. అశ్లీల సందేశాలు
- అధికారులకు ఫిర్యాదు చేసిన విద్యార్థ్థినులు
- అంతర్గత విచారణ చేపట్టిన వర్సిటీ అధికారులు
- నివేదికను బహిర్గతం చేయాలంటున్న బాధితులు
- సిద్దిపేట జిల్లాలోని వెటర్నరీ విద్యాసంస్థలో ఘటన
సిద్దిపేట, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన విద్యాసంస్థల్లో వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌కు సంబంధించిన వివాదం మరువకముందే, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లోని వెటర్నరీ విద్యాసంస్థలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోని సిద్దిపేట వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్‌పై విద్యార్థినులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ కొన్ని రోజులుగా వసతి గృహానికి రాత్రి వేళల్లో వచ్చి అసభ్యకరంగా మాట్లాడటం, తన గదికి రావాలని ఒత్తిడి చేయడం, అనుచితంగా శరీర భాగాలను తాకడం, సెల్ ఫోన్ ద్వారా అశ్లీల సందేశాలు పంపుతున్నట్టు విద్యార్థినులు ఫిర్యాదులో పేరొన్నారు. దీనిపై యూనివర్సిటీ అధికారులు అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టి నివేదిక సిద్ధం చేశారు. ఈ నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని విద్యార్థినులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఆరోపణల్లో వాస్తవాలు లేవు
కళాశాల అభివృద్ధి, విద్యార్థుల క్రమశిక్షణ, సిబ్బందిలో సమయపాలన కోసమే కఠినంగా వ్యవహరిస్తున్నా.. కొందరు కావాలనే నిరాధార ఆరోపణలు చేస్తూ మానసికంగా వేధిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలి. కళాశాలలో విద్యార్థులు, సిబ్బంది నిర్ణీత సమయానికి హాజరుకావాలని, ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనానికి తగిన విధంగా విధులు నిర్వర్తించాలని సూచించాను.
విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొందరు కక్ష పెంచుకుని, విద్యార్థులను ముందుపెట్టి ఫోన్లు చేయిస్తూ తప్పుడు ప్రచారానికి తెరలేపారు. నా ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరిస్తూ, తన కుటుంబం, పిల్లల భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే విధంగా మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. తనపై వస్తున్న ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలను లోతుగా పరిశీలించి సమగ్ర విచారణ ద్వారా నిజానిజాలను ప్రజల ముందుకు తీసుకువచ్చి, అసత్య ప్రచారానికి తెరదించాలని విజ్ఞప్తి చేస్తున్నా. – వెటర్నరీ కళాశాల ప్రిన్సిపాల్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

