చడ్డీ గ్యాంగ్‌ల తరహాలో సంజయ్, రేవంత్.. గుత్తా సుఖేందర్ రెడ్డి చురకలు
Gutha Sukhender reddy | బీజేపీ, కాంగ్రెస్ నేతలు బండి సంజయ్, రేవంత్ రెడ్డిల తీరు చడ్డీ గ్యాంగ్‌లను తలపిస్తుందని, ఒకవేళ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని దోచుకుతింటారని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేసీఆర్

నల్లగొండ : బీజేపీ, కాంగ్రెస్ నేతలు బండి సంజయ్, రేవంత్ రెడ్డిల తీరు చడ్డీ గ్యాంగ్‌లను తలపిస్తుందని, ఒకవేళ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని దోచుకుతింటారని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలోకి వస్తే దారి దోపిడీలు ఖాయమన్నారు.
ఈ మేరకు గుత్తా సుఖేందర్ రెడ్డి నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రైతులు చేస్తున్న న్యాయపరమైన పోరాటాన్ని అణిచివేయాలని కేంద్రం ప్రయత్నం చేస్తుందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో నిన్న నలుగురు రైతులు మృతి చెందడం బాధాకరమన్నారు. దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ఇక్కడేమో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరంగా నీతులు మాట్లాడుతున్నాడని, అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారనారు.
బీజేపీకి ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెప్తారని అన్నారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలుపు ఎప్పుడో ఖాయం అయిందని, గెల్లు శ్రీనివాస్ యాదవ్ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంటారని చెప్పారు. విద్య, వైద్యంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ సుభిక్షంగా, చల్లగా ఉంటుందన్నారు. ప్రతిపక్షాలు కేసీఆర్, కేటీఆర్ ల మీద బురద జల్లే ప్రయత్నం ఇప్పటికైనా మానుకోవాలని సూచించారు. కేవలం అధికార యావ తప్ప ప్రజల సంక్షేమం బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు పట్టవని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. చమురు ధరలను పెంచుతూ బీజేపీ పార్టీ ప్రజలను దోచుకుంటుందని గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

