శ్రీశైలం : దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు గురువందనం కార్యక్రమం నిర్వహించినట్లు శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. కంచికామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారికి శ్రీశైల దేవస్థానం తరఫున శేషవస్త్రాలు, స్వామి అమ్మవార్ల ఙ్ఞాపికను సమర్పించి, కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.
కాకినాడలో జరుగుతున్న పంచాగ సదస్సు సత్సంగ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వెళ్లిన ఈవో వెంట ఈఈ రామకృష్ణ, ఏఈవో హరిదాసు, వేదపండితులు గంటిరాధాకృష్ణ, పొలిపెద్ది సుబ్రహ్మణ్యం, హరిశ్చంద్ర, శాస్త్రి ఉన్నారు. శ్రీశైల దేవస్థానంలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి మహాస్వామి వారికి వివరించినట్లు ఈవో తెలిపారు.