తెలంగాణ వాణిజ్య విధానాలపై గుజరాత్ అధ్యయనం
ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఆయన భజన బృందమంతా పదే పదే దేశానికే రోల్‌మాడల్ అని చెప్పే గుజరాత్ ప్రభుత్వం, తెలంగాణ విధానాలను అధ్యయనం చేయడానికి రాష్ర్టానికి వచ్చింది. తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ విధానాలు తెలుసుకునేందుకు గుజరాత్ వాణిజ్యపన్నుల బృందం తెలంగాణకు విచ్చేసింది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పర్యటించింది.
- రాష్ట్రంలో వాణిజ్యపన్నుల శాఖ సంస్కరణలపై స్టడీ
- రెండురోజుల పాటు తెలంగాణలో పర్యటన
- తెలంగాణలో విధానాలు అద్భుతమంటూ కితాబు
హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఆయన భజన బృందమంతా పదే పదే దేశానికే రోల్‌మాడల్ అని చెప్పే గుజరాత్ ప్రభుత్వం, తెలంగాణ విధానాలను అధ్యయనం చేయడానికి రాష్ర్టానికి వచ్చింది. తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ విధానాలు తెలుసుకునేందుకు గుజరాత్ వాణిజ్యపన్నుల బృందం తెలంగాణకు విచ్చేసింది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పర్యటించింది. ప్రత్యేకరాష్ట్రంగా అవతరించిన తర్వాత తెలంగాణ అనేక రంగాల్లో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖలో కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది.
ఈ శాఖను స్వయంగా సీఎం కేసీఆర్ పర్యవేక్షిస్తూ, పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. అనతికాలంలో రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ రాబడి మూడురెట్లు పెరిగింది. దీంతో తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ విధానాలు, సంస్కరణలపై దేశంలోని అనేక రాష్ర్టాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇదే వరుసలో గుజరాత్ సైతం నిలిచింది. గుజరాత్ వాణిజ్యపన్నుల శాఖ జాయింట్ కమిషనర్ కేడీ శుక్లా, డిప్యూటీ కమిషనర్ ఆర్వీ సోనర్, అసిస్టెంట్ కమిషనర్ సందీప్ రాణా రెండురోజుల పాటు తెలంగాణలో పర్యటించి, రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాలను తెలుసుకున్నారు.
వాణిజ్యపన్నుల శాఖ విధానాలను గుజరాత్ బృందానికి స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ సాయి కిశోర్ వివరించారు. రాష్ట్రంలో కొత్తగా అనేక సర్కిళ్లు ఏర్పాటు చేశామని, ప్రతిస్థాయిలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించామని తెలిపారు. మాన్యువల్ నోటీసులు, ప్రొసీడింగ్ల జారీని పూర్తిగా తొలగించి శాఖాపరమైన పరిశోధనలు, విశ్లేషణల కోసం ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ విధానాలకు గుజరాత్ అధికారుల బృందం ఫిదా అయ్యింది. తెలంగాణలో విధానాలు అద్భుతంగా ఉన్నాయని, తమ రాష్ట్రంలోనూ ఇటువంటి గొప్ప సంస్కరణలు అవసరమని అభిప్రాయపడింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

