గ్రూప్-1 దరఖాస్తు సులభతరం
గ్రూప్ -1 దరఖాస్తు ప్రక్రియ శరవేగంగా జరిగేలా టీఎస్పీఎస్సీ చర్యలు చేపడుతున్నది. వెబ్‌సైట్‌పై లోడ్ పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నది. దీనికోసం ఒక టీం ప్రతి రోజూ పనిచేస్తున్నది. అభ్యర్థులకు ఇబ్బంది కలుగకుండా ప్రతి రోజు తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల వరకు పనులు చేస్తున్నది
5-8 నిమిషాల్లోనే దరఖాస్తు సమర్పణ
వెబ్‌సైట్‌పై భారం పడకుండా చర్యలు
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): గ్రూప్ -1 దరఖాస్తు ప్రక్రియ శరవేగంగా జరిగేలా టీఎస్పీఎస్సీ చర్యలు చేపడుతున్నది. వెబ్‌సైట్‌పై లోడ్ పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నది. దీనికోసం ఒక టీం ప్రతి రోజూ పనిచేస్తున్నది. అభ్యర్థులకు ఇబ్బంది కలుగకుండా ప్రతి రోజు తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల వరకు పనులు చేస్తున్నది. ఫలితంగా గ్రూప్-1 దరఖాస్తు ప్రక్రియ 5 నుంచి 8 నిమిషాల్లోనే పూర్తవుతున్నది. ఏమైనా సమస్య తలెత్తినట్టు దృష్టికి రాగానే దిద్దుబాటు చర్యలు చేపడుతున్నది.
గ్రూప్-1కు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు కాల్ చేసి, దరఖాస్తు సమయంలో తలెత్తిన ఇబ్బందులపై వాకబు చేస్తున్నది. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని తొలుత చెప్పినప్పటికీ.. ఆ తర్వాత అభ్యర్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆ నిర్ణయాన్ని టీఎస్పీఎస్సీ వెనక్కి తీసుకొన్నది. వివరాలు నమోదు చేస్తే సరిపోతుందని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ఒరిజినల్స్ చూపించాలని పేర్కొన్న విషయం తెలిసిందే.
50 వేలు దాటిన దరఖాస్తులు
గ్రూప్-1 కు ఆదివారం సాయంత్రం వరకు 50,986 మంది దరఖాస్తు చేసుకొన్నారు. కొత్తగా 89,332 మంది ఓటీఆర్ (వన్ టైం రిజిస్ట్రేషన్) నమోదు చేసుకోగా, 1,90,362 మంది ఓటీఆర్‌ను ఎడిట్ చేసుకొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- application
- easy
- Group 1
- process
RELATED ARTICLES
తాజా వార్తలు
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

