గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల.. పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ
Group-1 mains | తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే జూన్ నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. జూన్ 5 నుంచి 12 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే జూన్ నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. జూన్ 5 నుంచి 12 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నది. అందులో 11వ తేదీ ఆదివారం కాబట్టి ఆ రోజు పరీక్ష ఉండదని వెల్లడించింది.
గ్రూప్-1 మెయిన్ పరీక్షలు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో జరుగుతాయని టీఎస్పీఎస్సీ తెలిపింది. జనరల్ ఇంగ్లిష్ పేపర్ మినహా మిగతా అన్ని పేపర్లకు అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో పరీక్ష రాసుకోవచ్చని పేర్కొంది. కాగా, గత ఏడాది అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,86,051 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.
అయితే, గ్రూప్-1 ద్వారా మొత్తం 503 పోస్టులను భర్తీ చేయనున్న టీఎస్పీఎస్సీ ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు తీసుకుంది. అంటే ప్రిలిమ్స్‌కు హాజరైన వారి నుంచి 25,150 మంది అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేసింది.
కాగా, టీఎస్పీఎస్సీ షెడ్యూల్ ప్రకారం.. జూన్ 5న జనరల్ ఇంగ్లిష్ (అర్హత పరీక్ష), జూన్ 6న జనరల్ ఎస్సే (పేపర్-1), జూన్ 7న హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ (పేపర్-2), జూన్ 8న ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ (పేపర్-3), జూన్ 9న ఎకానమీ అండ్ డెవలప్మెట్ (పేపర్-4), జూన్ 10న సైన్స్ & టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్‌ప్రిటేషన్ (పేపర్-5), జూన్ 12న తెలంగాణ ఉద్యమం అండ్ రాష్ట్ర ఆవిర్భావం (పేపర్-6) అంశాలపై పరీక్షలు జరగనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
Jupally Krishna Rao | మంత్రి జూపల్లిని విమర్శించారని.. యువకుడిని చితకబాదిన ఎస్సై
Nereducherla | బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడి!
Journalist Shankar | ప్రశ్నించినందుకు జర్నలిస్టు శంకర్ అరెస్ట్.. మెడికవర్ యాజమాన్యం ఫిర్యాదుపై కేసు
Asian Para Games | భారత్‌కు ఒక్క రోజే 26 మెడల్స్.. 2 స్వర్ణాలతో మెరిసిన ఆర్చర్ శీతల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

