యాసంగి పంటగా వేరుశనగ

- ‘గ్రౌండ్నట్ సీడ్ బౌల్’గా రాష్ర్టాన్ని తీర్చిదిద్దాలి
- ఇక్రిశాట్, అగ్రి వర్సిటీ ఆధ్వర్యంలో పరిశోధన
- రూ.9 కోట్ల అంచనా వ్యయంతో ప్రత్యేక ప్రణాళిక
- అధికారులతో సమీక్షలో మంత్రి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పండించే వేరుశనగకు అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వేరుశనగ సాగు భారీగా పెరగాల్సిన అవసరం ఉన్నదని ఉద్ఘాటించారు. యాసంగిలో వేరుశనగ ప్రధాన పంటగా మారాలని, ఆ దిశగా రైతులు ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ‘సీడ్ బౌల్ ఆఫ్ గ్రౌండ్నట్’ (వేరుశనగ విత్తన భాండాగారం)గా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. వేరుశనగ సాగు పెంపు, నూతన వంగడాల తయారీపై శుక్రవారం ఆయన ఇక్రిశాట్, వ్యవసాయ శాఖ, అగ్రి వర్సిటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. అయోలిక్ యాసిడ్ అధికంగా ఉండి, అధిక దిగుబడినిచ్చే అప్లాటాక్సిన్ రహిత వంగడాల తయారీపై ఇక్రిశాట్, వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యంలో పరిశోధన జరగాలని సూచించారు. ఇందుకోసం ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో వేరుశనగ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రూ.9 కోట్ల అంచనాతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే మంజూరైన వనపర్తి వేరుశనగ పరిశోధన కేంద్రానికి త్వరలోనే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని చెప్పారు. గుజరాత్లో వేరుశనగ సాగు అత్యధికంగా ఉన్నప్పటికీ నాణ్యత లేదని, ఇది తెలంగాణ రైతులకు ఎంతో లాభించే అంశమని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, ఎండీ కేశవులు, ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు జనీలా, అశోక్, హరికిషన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

