Groom Dies | పెళ్లింట సందడి.. అంతలోనే ఊహించని ప్రమాదం.. విద్యుత్ షాక్‌తో వరుడు మృతి..!
Groom Dies | మహబూబాబాద్ రూరల్ : ఆ ఇల్లంతా పెళ్లి సందడి నెలకొన్నది. బంధువులతో కళకళలాడుతున్నది. ఓ వైపు పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతలోనే ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకున్నది.
Groom Dies | మహబూబాబాద్ రూరల్ : ఆ ఇల్లంతా పెళ్లి సందడి నెలకొన్నది. బంధువులతో కళకళలాడుతున్నది. ఓ వైపు పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతలోనే ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకున్నది. రేపు పెళ్లి అనగా వరుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ మండల పరిధిలోని కొమ్ముగూడెంలో తండాలో చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన భూక్యా బాలాజీ-కాంతి దంపతులకు ఇద్దరు సంతానం. పెద్దవాడు యాకూబ్ (21) హైదరాబాద్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల యాకూబ్‌కు గార్ల మండల శివారు పీక్లీతండాకు చెందిన బోడ శివ-సక్కు దంపతుల పుత్రికతో వివాహం నిశ్చయమైంది.
శుక్రవారం పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. పెళ్లి కోసం బంధువులంతా ఇంటికి చేరుకోగా.. సందడి నెలకొన్నది. అందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఇంట్లో నీరు అయిపోవడంతో బోర్ మోటార్ స్విచ్ వేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు షాక్‌కు గురై కిందపడిపోయాడు. వెంటనే బంధువులు స్థానికులు హాస్పిటల్‌కు తరలిస్తుండగా.. మృతి చెందాడు. తెల్లారితే పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు.. పాడెక్కడంతో తండాలో యాకూబ్ ఇంటితో పాటు వధువు ఇంట విషాదం అలుముకున్నది. యూకూబ్ మృతితో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

