రాష్ట్రంలో 7.7 శాతం పెరిగిన గ్రీన్‌కవర్.. ప్రశంసించిన కేంద్రం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల వల్ల పచ్చదనం పెరిగిందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. 2015 నుంచి 2021 సంవత్సరాల మధ్య పచ్చదనం (గ్రీన్ కవర్) శాతం 7.70 శాతం పెరిగినట్లు IFSR ప్రకటించిందన్నారు.
హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల వల్ల పచ్చదనం పెరిగిందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. 2015 నుంచి 2021 సంవత్సరాల మధ్య పచ్చదనం (గ్రీన్ కవర్) శాతం 7.70 శాతం పెరిగినట్లు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (IFSR) ప్రకటించిందన్నారు. పచ్చదనం పెరగడంపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిదని తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా హరితహార కార్యక్రమం, పచ్చదనం పెంపుకు తీసుకుంటున్న చర్యలు, తదితర అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి పెద్దఎత్తున పనులు చేపడుతున్నామన్నారు.
హరితహారం కార్యక్రమం ద్వారా అడవుల లోపల, వెలుపల పెద్దఎత్తున మొక్కలు పెంచాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా 2022-23లో 19.29 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, 2023-2024లో 20.02 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని వెల్లడించారు. మొక్కల పెంపక కార్యక్రమాలు చేపట్టడానికి గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలకు బడ్జెట్లో 10 శాతం గ్రీన్ బడ్జెట్‌గా కేటాయించామన్నారు. మొక్కల పెంపకం సక్రమంగా పర్యవేక్షణ జరిగేలా చూడటానికి జియో ట్యాగింగ్ ఆఫ్ ప్లాంటేషన్స్‌ను చేపట్టామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

