హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి ఆయనకు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్‌రావు, భానుప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే భాసర్‌రావు, లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, బీఆర్ఎస్ ఎల్పీ సెక్రటరీ రమేశ్‌రెడ్డి, నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలు, అభిమానులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, సిబ్బంది తదితరులు గుత్తా సుఖేందర్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.