అపోహ వీడి అందరూ టీకా వేసుకోవాలి : గవర్నర్ తమిళిసై
Governor Tamilisai | దేశంలో వంద కోట్ల టీకాల పంపిణీ పూర్తి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రత్యేక సందేశం ఇచ్చారు. అపోహ వీడి అందరూ టీకా వేసుకోవాలని గవర్నర్ కోరారు. ప్రత్యేక సందేశం ఇచ్చిన సందర్భంగా గవర్నర్ తెలుగులో అనర్గళంగా మాట్లాడారు.

హైదరాబాద్ : దేశంలో వంద కోట్ల టీకాల పంపిణీ పూర్తి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రత్యేక సందేశం ఇచ్చారు. అపోహ వీడి అందరూ టీకా వేసుకోవాలని గవర్నర్ కోరారు. ప్రత్యేక సందేశం ఇచ్చిన సందర్భంగా గవర్నర్ తెలుగులో అనర్గళంగా మాట్లాడారు.
గవర్నర్ ప్రత్యేక సందేశం..
ఇవాళ్టి వరకు భారతదేశంలో వంద కోట్ల కొవిడ్ టీకాలను ప్రజలకు ఇచ్చిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి, వైద్య సిబ్బందికి నా నమస్కారాలు. ఈ ఏడాది జనవరి 16న ప్రారంభమైన టీకా పంపిణీ.. నేటి వరకు వంద కోట్ల డోసుల పంపిణీకి చేరుకోవడం సంతోషంగా, గర్వకారణంగా ఉంది. మనం టీకాను ఉత్పత్తి చేయడమే కాకుండా, ఆ టీకాను ప్రజలకు ఇవ్వడంలో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచాం. నేడు భారత్ ప్రపంచ దేశాలకు కొవిడ్ టీకాను అందించే స్థాయికి చేరింది. మన వాడ, మన గ్రామం, మన పట్టణంలో ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలి. కొవిడ్ టీకా తీసుకున్న తర్వాత కూడా జనాలు భౌతిక దూరం పాటించాలి. మాస్కు ఎల్లప్పుడూ ధరిస్తూ, చేతులు తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలి. కొవిడ్ నియంత్రణ చర్యల్లో పాల్గొన్న డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు, శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు. కొవిడ్ టీకాను ఉత్పత్తి చేసిన శాస్త్రవేత్తలకు గవర్నర్ సెల్యూట్.
ఈఎస్ఐ ఆస్పత్రిని సందర్శించిన గవర్నర్
దేశంలో వంద కోట్ల టీకాల పంపిణీ పూర్తి సందర్భంగా సనత్ నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ గురువారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. దేశంలో ఉత్పత్తి చేసిన టీకా తీసుకున్నందుకు గర్విస్తున్నానని తెలిపారు. విదేశాలకు దేశీయంగా ఉత్పత్తి చేసిన టీకాలు ఎగుమతి చేశాం. దేశ వ్యాప్తంగా వంద కోట్ల మంది టీకా తీసుకున్నారు. అపోహ వీడి అందరూ టీకా వేసుకోవాలి. ఐసీయూలో చేరిన వారిలో ఎక్కువ మంది టీకా తీసుకోని వారేనని తెలిపారు. 2 నుంచి 18 ఏండ్ల వయసు పిల్లలకు కూడా టీకా రానుంది అని గవర్నర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

